Begin typing your search above and press return to search.

పాక్‌ కు ఆ విష‌యంలో ఆర్డ‌ర్ వేసిన ఓవైసీ

By:  Tupaki Desk   |   27 Feb 2019 5:13 PM GMT
పాక్‌ కు ఆ విష‌యంలో ఆర్డ‌ర్ వేసిన ఓవైసీ
X
భారత వాయుసేనకు చెందిన మిగ్‌-21 ఫైటర్‌ జెట్‌ ను తాము కూల్చివేశామ‌ని - ఇందులో ఉన్న‌ ఫైటర్‌ పైలట్‌ ను కూడా తాము అదుపులోకి తీసుకున్నామని పాక్ ఆర్మీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ పైలట్‌ కు సంబంధించిన వీడియో విడుదల చేసి పాక్ అందులో తన పేరు అభినంద‌న్‌ అని - ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ లో పనిచేస్తున్నానని పేర్కొంది. అయితే, జెట్‌ కూలిపోయిన వెంటనే ప్యారాచూట్‌ సహాయంతో కిందికి దిగిన పైలట్‌ ను స్థానికులు కొడుతున్నట్లుగా ఉంది. పాక్‌ ఆర్మీ వారిని వారించి - అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఆ విడియోలో స్పష్టంగా కనబడుతోంది.

భారత్‌ కు చెందిన పైలట్ అభినందన్‌ ను తాము కస్టడీలోకి తీసుకున్నామని పాకిస్థాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అతను కస్టడీలో ఉన్న వీడియోను కూడా రిలీజ్ చేసింది. అయితే ఆ పైలట్ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని, ఈ కష్టకాలంలో అతని కుటుంబం ధైర్యంగా ఉండాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. అంతేకాదు ఆ పైలట్ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత పాకిస్థాన్‌దేనని స్పష్టం చేశారు. జెనీవా కన్వెన్షన్స్‌ లోని ఆర్టికల్ 3 ప్రకారం ఖైదీలను అన్ని దేశాలు మానవతా దృక్పథంతో చూడాలి. సదరు ఐఏఎఫ్ పైలట్ విషయంలో పాకిస్థాన్ ఇలాగే వ్యవహరించాలి. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నా.. పాక్ అతన్ని బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని అసద్ ఆ ట్వీట్‌లో స్పష్టం చేశారు.

ఇదిలాఉండ‌గా, దౌత్యపరం‍గా పాకిస్థాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి అభినందన్‌ను విడిపించుకోవాలన్న ఆలోచనలో భారత్‌ ఉంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని పాకిస్థాన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ సయిద్‌ హైదర్‌ను పిలిపించుకుని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరసన వ్యక్తం చేసింది. కాగా, పాకిస్థాన్‌ కస్టడీలో ఉన్న వింగ్‌ కమాండర్‌ విక్రమ్‌ అభినందన్‌ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపణవూరు. అభినందన్‌ తండ్రి రిటైర్డ్‌ ఎయిర్‌ మార్షల్‌. తమిళనాడులోని ఉడుమలైపేటలోని సైనిక్‌ స్కూల్‌లో అభినందన్‌ చదివారు. అభినందన్‌ కుటుంబం చెన్నైలోని తాంబరం ఎయిర్‌ఫోర్స్‌ అకాడమిలో నివసిస్తోంది.