Begin typing your search above and press return to search.

భార‌త్‌- చైనా వివాదం: కేంద్రం తీరుపై అస‌దుద్దీన్ తీవ్ర ఆగ్ర‌హం

By:  Tupaki Desk   |   8 Jun 2020 2:00 PM GMT
భార‌త్‌- చైనా వివాదం: కేంద్రం తీరుపై అస‌దుద్దీన్ తీవ్ర ఆగ్ర‌హం
X
కొన్ని వారాలుగా స‌రిహ‌ద్దు దేశం చైనాతో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. డ్రాగ‌న్ రాజ్యం భార‌త భూభూగంలోకి చొచ్చుకురావ‌డం, స‌రిహ‌ద్దుల్లో బ‌ల‌గాల‌ను మోహ‌రించ‌డం వంటి వాటితో యుద్ధ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. అయితే ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వాన్ని హైద‌రాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం పార్టీ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా భార‌త్‌, చైనా సైనికాధికారుల స్ధాయి చర్చల సారాంశాన్ని వెల్లడించాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు.

‘మన సైన్యం, చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు.. చైనా ప్రతినిధులతో ఏం మాట్లాడారో కేంద్ర ప్రభుత్వం దేశానికి వివరించాలి’ అని ఆయ‌న కోరారు. ఈ విషయంలో కేంద్రం ఎందుకు మౌనం దాల్చుతోందని, లడఖ్‌లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా లేదా అని ప్రశ్నించారు.

ఇండో - చైనా సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వ్యవహారంలో ప్రతిష్టంభన ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. భారత్‌, చైనాలు సరిహద్దు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు అంగీకరించాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈక్ర‌మంలోనే శ‌నివారం (జూన్ 6) సరిహద్దు సమస్యల పరిష్కారం దిశగా భారత్‌-చైనా సైనికాధికారుల భేటీ జ‌రిగిన విష‌యం తెలిసిందే.