Begin typing your search above and press return to search.
టీడీపీ పెద్దాయన... మోడీ మీద మనసాయెనా... ?
By: Tupaki Desk | 8 Oct 2021 4:23 AM GMTప్రధాని మోడీ ప్రత్యేకమైన రాజకీయ వ్యక్తిత్వం కలిగిన వారు. ఆయన గురించి ఎవరైనా ఎన్ని అయినా విమర్శలు చేయవచ్చు కానీ ఆయన వ్యక్తిత్వాన్ని మెచ్చుకు తీరాల్సిందే. ఆయనకు మాత్రమే పరిమితమైన కొన్ని క్వాలిటీస్ ని పొగిడి తీరాల్సిందే. అందుకే టీడీపీకి చెందిన పెద్దాయన, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కూడా మోడీ ఒక స్పూర్తి అంటున్నారు. నిజమే మోడీ స్పూర్తిదాయకమే. ఎలాగంటే ఆయన ఓటమి ఏరగని వీరుడు. ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో ఎంతటి వారికైనా ఓటమి తప్పలేదు. కానీ దానికి అతీతుడుగా మోడీ ఉన్నారంటే గ్రేట్ కదా. అంతే కాదు, ఆయన పట్టుదల, శ్రమించే తత్వం, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వైనం అన్నీ కూడా స్పూర్తిదాయకమే.
మరి ఇందులో ఏం నచ్చిందో తెలియదు కానీ మోడీ మీద అపరిమితమైన ప్రేమాభిమానాలను కురిపించేశారు అశోక్ గజపతి రాజావారు. మోడీ ఫోటోలతో చిత్ర ప్రదర్శనను బీజేపీ ఏర్పాటు చేసింది. దానికి ముఖ్య అతిధిగా అశోక్ వెళ్ళడమే విడ్డూరం అంటే. గత మూడేళ్ళుగా బీజేపీతో టీడీపీకి ఏ రాజకీయ సంబంధాలు లేవు. ఎన్డీయేతో కటీఫ్ చేసుకుని నాడు చంద్రబాబు బయటకు వచ్చాక అశోక్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అది కూడా ఆయన ఇష్టం లేకపోయినా పార్టీ తీసుకున్న స్టాండ్ మేరకే చేశారని చెబుతారు.
ఇవన్నీ పక్కన పెడితే 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుని గెలిచిన తరువాత కేంద్రంలో టీడీపీకి కొన్ని మంత్రి పదవులు ఇచ్చారు. అయితే అశోక్ గజపతిరాజుని మాత్రం ప్రధాని మోడీ కోరి ఎన్నుకున్నారని, తన మంత్రి వర్గ సహచరునిగా మెచ్చి మరీ తీసుకున్నారని అప్పట్లో ప్రచారంలో ఉంది. దీనికి కారణం రాజు గారి నిబద్ధత, నిజాయాతీ అని అంటారు. దానికి తగినట్లుగానే ఆయనకు ప్రతిష్టాత్మకమైన పౌర విమానయాన శాఖను ఇచ్చారు. ఆయన కూడా సమర్ధవంతంగా పనిచేశారు. మోడీకి అశోక్ మీద మంచి గురి ఉండేదని అంటారు. అలా ఈ ఇద్దరి బంధం నాలుగేళ్ళ పాటు సాగింది. రాజకీయపరమైన కారణాలతో టీడీపీ బీజేపీకి దూరం జరిగినా కూడా మోడీ పట్ల అశోక్ అభిమానం అలాగే ఇప్పటికీ ఉందని చెబుతారు. దానికి నిదర్శనమే తాజాగా బీజేపీ ఏర్పాటు చేసిన మోడీ ఫోటో ఎగ్జిబిషన్ కి అశోక్ వెళ్ళి ఆయన గురించి కొన్ని మంచి మాటలు చెప్పడం. మరి ఇది రేపటి రోజున బీజేపీ టీడీపీ పొత్తునకు సంకేతమా అన్నా అనుకోవచ్చేమో. చూడాలి మరి ఏం జరుగుతుందో.