Begin typing your search above and press return to search.
చెట్టు కింద కారు....రాజావారు బేజారు
By: Tupaki Desk | 29 Dec 2021 1:30 AM GMTకారు షికారు హుషార్. ఈ మూడింటినీ కలిపితే అద్భుతమైన కవిత అవుతుంది. షి ఉంటే షికార్ అన్నారు వెనకటికి ఒక సినీ కవి. కారు ఉన్నా కూడా షికారే. మరి అలాంటి ఇలాంటి కారు కాదు ఇన్నోవా కారే ఇచ్చి స్వారీ చేయమంటే సారీ అంటున్నారు పూసపాటి రాజావారు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటి అంటే భలే ఇంటరెస్టే మరీ.
రాజు గారు రాజకీయాల్లో రాటుతేలిన నాయకుడు. కేంద్రంలో మంత్రిగా నాలుగేళ్లకు పైగా కీలకమైన శాఖను చూసిన సమర్ధుడు. ఇక ఏ అధికార పదవీ లేకపోయినా ఆయన వంశం నుంచి వారసత్వంగా వచ్చిన పదవులే చాలు. అవే ఎన్నో రెట్లు మిన్న. ఏకంగా నూటా ఎనిమిది దేవాలయాలకు పూసపాటి రాజులు ధర్మకర్తలు. అందులో సింహాచలం ఆలయం ఒకటి. ఉత్తరాంధ్రాలో సుప్రసిద్ధి సాధించిన ఆలయం ఇది.
దీనికి చైర్మన్ గా గత ఆరేళ్ళుగా అశోక్ వ్యవహరిస్తున్నారు. మధ్యలో వైసీపీ సర్కార్ సంచయితను తెచ్చి అక్కడ కూర్చోబెట్టి అశోక్ ని ఇబ్బంది పెట్టింది. గత ఏడాది మార్చిలో ఈ రచ్చ స్టార్ట్ అయింది. అయితే దాని మీద కోర్టుకు వెళ్ళి మరీ న్యాయపరంగా రాజుగారు తన హక్కులను సాధించుకున్నారు. దాంతో ఆయనే సింహాచలం ఆలయ చైర్మన్ గా ఉంటున్నారు.
కానీ ఆయనకు సింహాచలం దేవస్థానం చైర్మన్ హోదా కోసం ఒక ఇన్నోవా కారుని సమకూర్చింది. అయితే అది ఏమాత్రం సులభంగా రాలేదు. దాని మీద ఆయన అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు దేవస్థానం ఈవోకు రాసిన మీదట ఇన్నోవా కారుని పంపారు. అయితే ఇంత వత్తిడి మీద తెచ్చుకున్న ఇన్నోవా కారు ఎక్కాలంటేనే రాజు గారుకు బేజారు అవుతోందిట.
దానికి కారణం ప్రస్తుత ప్రభుత్వం తనను టార్గెట్ చేసింది అన్న భావనతోనే. నిజానికి అయిన దానికీ కాని దానికీ కూడా దేవాలయాల మీద ప్రభుత్వం వివాదాలను రాజేస్తోంది అని రాజు గారి అనుచరులు అంటున్నారు. దానికి లేటెస్ట్ ఉదాహరణ రామతీర్ధం ఘటనే. చక్కంగా రాజు గారిని ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆహ్వానించి ఉంటే ఏ గొడవా ఉండేది కాదు,
కానీ ఆయన ఇగో హర్ట్ చేయాలని, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూడడం వల్లనే రాజావారు కూడా కాస్తా దూకుడు చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే నాలుగు నెలల క్రితం రాజు గారికి సింహాచలం దేవస్థానం ఇచ్చిన ఇన్నోవా కారుని ఆయన వాడకుండా తన బంగ్లా చెట్టు కిందనే ఖాళీగా ఉంచేశారు. ఏ కార్యక్రమం అయినా కూడా తన సొంత వాహనంలోనే వెళ్తున్నారు.
దానికి కారణం ఏంటి అన్నది ఆయన సన్నిహితుల ద్వారా తెలిసినది వింటే షాక్ అవాల్సిందే. మొదట ఇన్నోవా కారు పంపించి దాని మీద సింహాచలం దేవస్థానానికి చెందినది అని నిబంధలన మేరకు రాయకుండా వదిలేశారు. ఇదేంటి అని అడిగితే ప్రభుత్వ వాహనం అని స్టిక్కర్ ఒకటి అతికించారుట. దాంతోనే ఆ కారు వద్దు అని రాజా వారు అనుకుంటున్నారుట.
ప్రభుత్వ వాహనం అని రాయడం నిబంధలనకు విరుద్ధం. ఎందుకంటే దేవస్థానం చైర్మన్ అన్నది నేరుగా ప్రభుత్వానికి చెందినది కాదు, కేవలం ప్రభుత్వ నియంత్రణలో ఉన్నది మాత్రమే. దాంతో ఏ విధంగానూ నిబంధనలకు వీలు కాని ప్రభుత్వ వాహనం స్టిక్కర్ అతికించుకుని తాను ప్రయాణిస్తే దాని మీద కొత్త రభస చేస్తారని, కేసులు కూడా పెట్టి టార్గెట్ చేస్తారన్న అనుమానాలు ఏవో రాజు గారిలో ఉన్నాయట. అందుకే దాని మానాన అలా చెట్టు నీడన వదిలేశారట.
ఇక్కడ ఒక ముచ్చట చెప్పుకోవాలి. సంచయిత చైర్మన్ గా ఉన్నపుడు చైర్మన్ దేవస్థానం అని స్టిక్కర్ పెట్టి మరీ నెలకు రవాణా ఖర్చుల కింద డెబ్బై అయిదు వేల రూపాయలు ఇచ్చేవారట. మరి రాజకీయంగా చూస్తే రాజు గారి మీద ఏదో టార్గెట్ ఉందనే కదా ఇదంతా అంటున్నారు అనుచరులు. సో ఇన్నోవా కారుకో దండం అనేయడానికి ఇదే రీజన్ అని వారు చెబుతున్నారు.