Begin typing your search above and press return to search.
సుజనాకు ఇంకా మోడీపై నమ్మకం తగ్గలేదే!
By: Tupaki Desk | 8 March 2018 2:04 PM GMTకేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ మంత్రులుగా కొనసాగుతున్న టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రి పదవులకు అశోక్ గజపతి రాజు - సుజనా చౌదరి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం ప్రధాని మోడీతో భేటీ అయిన ఇద్దరు రాజీనామాలు సమర్పించారు. పౌర విమానయానశాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు.. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా సుజనా చౌదరి ఉన్న విషయం తెలిసిందే. 2014 మే 26న మంత్రిగా అశోక్ గజపతి - నవంబర్ 9న సుజనా చౌదరి బాధ్యతలు స్వీకరించారు. కాగా ఈ ఇద్దరూ మోడీని కలవడానికి వెళ్లినప్పుడు తమ సొంత వాహనాల్లో వెళ్లడం గమనార్హం.
కాగా, రాజీనామా అనంతరం ఈ ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. తమ నాయకుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని అశోక్ గజపతిరాజు ప్రశంసించారు. `మా పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నారు - మేం రాజీనామా చేశాం - మా రాజీనామాలను ఆమోదిస్తారనే ఆశిస్తున్నాం. ప్రజల సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకొని రాజీనామా నిర్ణయం తీసుకున్నాం.ఎన్డీఏలో కొనసాగుతున్నాం - పార్టీ ఆదేశాల మేరకు మంత్రి పదవులకు రాజీనామాలు చేశాం` అని అశోక్ గజపతిరాజు తెలిపారు. సుజనాచౌదరి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మమ్మల్ని గౌరవంగా రిసీవ్ చేసుకున్నారనీ, తాను ఆంధ్రప్రదేశ్ తో ఉంటానని హామీ ఇచ్చారని సుజనా చౌదరి అన్నారు. ప్రత్యేక హోదాక బదులుగా ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారని కానీ తన హామీని కూడా నిలబెట్టుకోలేదని అందుకే తామీ నిర్ణయం తీసుకున్నామని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అత్యంత అడ్డగోలుగా జరిగింది, ఒక జాతీయ పార్టీ దగా చేస్తే.. మరో జాతీయ పార్టీ మోసం చేసిందని సుజనా చౌదరి మండిపడ్డారు.
కాగా, తన రాజీనామా లేఖలో సుజనా చౌదరి ‘మీ నాయకత్వంలో మంత్రిగా పని చేసే అవకాశం లభించినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. అలాగే కేంద్ర మంత్రిగా మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలం ఎంతో సంతృప్తిగా గడిచిందని పేర్కొన్నారు. పార్టీ - రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు రాజీనామా సమర్పిస్తున్ననని ఆ లేఖలో పేర్కొన్నారు.