Begin typing your search above and press return to search.
మంత్రులు మాట్లాడే భాష నాకు రాదు.. అశోక్ సంచలన కామెంట్లు
By: Tupaki Desk | 23 Dec 2021 5:34 PM GMTవిజయనగరం జిల్లాలోని రామతీర్థంలో ఉన్న రామాలయంలో జరిగిన వివాదం తర్వాత.. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర మంత్రులపై విమర్శలు గుప్పించారు. మంత్రులు మాట్లాడే భాష తనకు రాదని.. వారిలా తాను బూతులు తిట్టలేనని అన్నారు. అంతేకాదు.. సింహాచలం ఆలయానికి ట్రస్టీగా వ్యవహరించిన సంచయితకు ప్రభుత్వం దేవుడి సొమ్మును నెలకు రూ.75 వేల చొప్పున దోచిపెట్టిందని.. ఇది చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై న్యాయ పోరాటానికి దిగుతున్నట్టు తెలిపారు.
ఇంకా ఏమన్నారంటే.. ``దేవాదాయ శాఖ లో ఆచార, సంప్రదాయాలు తప్పా ప్రోటో కాల్ అనేది ఉండదు. అనువంశిక ధర్మకర్తగా ఉన్న నాకు తెలియకుండా రామతీర్థంలో శంకుస్థాపన, శిలాఫలకాల ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. నాకు చెప్పకుండా ఆహ్వానం పత్రిక లో నా పేరు ఎలా ముద్రిస్తారు? మంత్రి గారు రావటం ఆలస్యం అయిందని ముహుర్తం కూడా ఆలస్యం చేయటానికి ప్రయత్నించారు. ప్రభుత్వం అందరిని అయోమయానికి గురిచేస్తుంది. దేవాదాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినది కాదు. ముహూర్తం ఆలస్యం అవుతుందని నేనే త్వరగా కార్యక్రమాలు చేయాలని కోరాను. పూజా విధానం కొత్త పద్దతిలో చేస్తుంటే సర్కస్ లా చేయొద్దని అన్నాను. దేవాదాయశాఖ మంత్రి నా ముందే సిబ్బందిని తిట్టారు.`` అని వివరించారు.
సంప్రదాయాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేశారని అశోక్ గజపతిరాజు దుయ్యబట్టారు. తనకు కొబ్బరి కాయ కొట్టే అవకాశం లేకుండా దేవాదాయశాఖ మంత్రి అడ్డువచ్చారని చెప్పారు. ముహూర్తం సమయం పూర్తవుతున్నా ఆగండి అంటూ అడ్డుపడ్డారని తెలిపారు. ``సంప్రదాయాలు, ఆచారాలు ప్రకారమే ఆలయ చైర్మన్లు అవుతారు తప్ప చైర్మన్లను ప్రభుత్వం నియమించదు. నా పై ప్రభుత్వానికి ప్రత్యేక దృష్టి ఉంది. సంచయితకు సింహాచలం ఆలయ నుండి 75,000 అలవెన్సుల కింద ఇచ్చారు. సంచయితకు అలవెన్సులు ఇవ్వటం చట్టవ్యతిరేకం. దీనిపై న్యాయ పోరాటం చేస్తా.`` అని అశోక్ వివరించారు.
శంఖుస్థాపన సమయంలో స్వామివారి విగ్రహం వద్ద బూట్లు తో వచ్చారని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. రామతీర్థం కింద కొండ ప్రాంతంలో మట్టి తవ్వకాలు జరుపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రుల భాష తనకు రాదని, తన తల్లిదండ్రులు తనను ఎలా పెంచారో వారికే తెలియదు అని బొత్స అంటున్నారని, స్వర్గీయ తల్లిదండ్రులు మీద ఆయన చేసిన కామెంట్స్ తనకు అర్ధం కాలేదని.. వ్యాఖ్యానించారు. ఇక, పై వారి ఒత్తిడి మేరకు తన మీద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వారి ఫిర్యాదు లో పేర్కొన్నారని , ఆ కేసులేంటో తనకు తెలియదని అశోక్ చెప్పారు.