Begin typing your search above and press return to search.
పవన్ తెలియదు.. అశోక్ మళ్లీ మొదలెట్టాడు..
By: Tupaki Desk | 28 Jan 2019 6:07 AM GMTఇప్పటికే జనసేనాని, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదంటూ దుమారం రేపిన కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు.. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై సెటైర్ వేశారు. మరోసారి అదేరకం విమర్శలు చేశారు. తాజాగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ‘తాను సినిమాలు చూడనని.. పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి తెలుసు’ అని తెలిపారు. అంతటితో ఆగకుండా చిరు-పవన్ తండ్రిపై కూడా అశోక్ గజపతి కామెంట్ చేశారు..
‘పవన్ కళ్యాణ్ వాళ్ల నాన్న కూడా తనకు తెలుసు. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్నప్పుడు పవన్ తండ్రి ఒక పనికోసం తన దగ్గరకు వస్తే చేసి పెట్టాను’ అని అశోక్ గజపతి సంచలన విషయం బయటపెట్టాడు.
గతంలో పవన్ ఎవరో తెలియదని అశోక్ గజపతి అన్నప్పుడు పవన్ సహా జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు మళ్లీ పవన్ ను కెలికి అశోక్ గజపతి వివాదాలకు ఆజ్యం పోశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ‘పవన్ పై విమర్శలు చేయొద్దు.. ఏమన్నా ఊరుకోండని’ ఓవైపు సూచనలు చేస్తుంటే అశోక్ గజపతి మాత్రం తాజాగా పవన్ పై విమర్శలకు పదునుపెట్టడం టీడీపీ శిబిరాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. పవన్ ను మచ్చిక చేసుకొని మరోసారి పొత్తు పెట్టుకోవాలని చూస్తున్న చంద్రబాబుకు అశోక్ వ్యాఖ్యలు ఇరకాటంతో నెట్టాయి.
అయితే పవన్ పై అశోక్ గజపతి వ్యాఖ్యల వెనుక అర్థం వేరే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాను సినిమాలు చూడనని అశోక్ అన్న మాటలను బట్టి.. పవన్ కళ్యాణ్ ను సినీ హీరోగా మాత్రమే జనాలు చూస్తున్నారని పరోక్షంగా చెప్పే ప్రయత్నం అశోక్ గజపతి చేశారని అర్థమవుతోందంటున్నారు. పవన్ ను రాజకీయ పార్టీ అధినేతగా ప్రస్తావించకుండా అశోక్ కౌంటర్ ఇచ్చారు. మరి అశోక్ కు మరోసారి పవన్ ఎలాంటి కౌంటర్ ఇస్తాడన్నది వేచి చూడాల్సిందే..