Begin typing your search above and press return to search.

అంతా కన్ఫ్యూజన్ పాలనేనట...?

By:  Tupaki Desk   |   19 Jan 2022 12:30 AM GMT
అంతా కన్ఫ్యూజన్ పాలనేనట...?
X
అయోమయం. గందరగోళం, అంతా కన్ఫ్యూజన్. ఇదేమి పాలన అంటున్నారు సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు. ఆయన వైసీపీ పాలన మీద బాగా మండుతున్నారు. అంతా రివర్స్ గేర్ పాలన. ఎటు చూసినా సందిగ్దత. ఏ విషయంలోనూ లేదు క్లారిటీ అంటూ విసుక్కుంటున్నారు. మూడేళ్ళు దగ్గర పడుతున్నా పాలన గాడిలో పడలేదుగా అంటూ పెదవి విరుస్తున్నారు.

మొత్తానికి వైసీపీ మీద పంచులు పేల్చాలీ అంటే రాజు గారే అనే అంటున్నారు టీడీపీ తమ్ముళ్ళు. ఆయన సాధారణంగా పెద్దగా రాజకీయ విమర్శలు చేయరు. హుందాగా ఉంటారు. తన మానాన తాను పనిచేసుకుంటారు. అలాంటి రాజు గారిని వైసీపీ సర్కార్ కెలికి మరీ ఇలా హాట్ హాట్ కామెంట్స్ చేయించుకుంటోంది. ఆయన మాన్సాస్ సంస్థల మీదకు సర్కార్ పెద్దలు రావడంతోనే రాజు గారు గుస్సా అవుతున్నారు. ఇక దేవాలయాల్లో ప్రోటోకాల్ పాటించడంలేదు అంటూ కస్సుమంటున్నారు.

ఇలా వైసీపీ ఏలుబడి మీద తరచూ విరుచుకుపడుతున్న వారి జాబితాలో రాజా వారు కూడా చేరిపోయారు. లేటెస్ట్ గా ఆయన జగన్ పాలన మీద అంతా కన్ఫ్యూజన్ అంటూ సెటైర్లు వేశారు. ఏపీలో కరోనా కట్టడి అంటారు. కానీ బడులకు మాత్రం సెలవులు ఇవ్వరు. గుడులకు బాగా ఆంక్షలు పెడతారు, మరో వైపు మందు దుకాణాలకు గంటల కొద్దీ సమయం పెంచేస్తారు. ఇదేనా కరోనా కట్టడి అంటే అని అశోక్ గట్టిగానే సౌండ్ చేస్తున్నారు.

తెలుగుదేశం పాలనలో ఒక పద్ధతి, విధానం అంటూ ఉండేదని, నాడు అయిదేళ్ళు చక్కని పాలన అందించామని రాజు చెప్పుకున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సాగిందని అన్నారు. ఇపుడు ఈ పాలన చూసి ఏం చెప్పాలో కూడా అర్ధం కావడం లేదని ఆయన అంటున్నారు. మొత్తానికి అజాత శతృవు లాంటి అశోక్ ని కూడా ప్రత్యర్ధిగా చేసుకున్న పుణ్యమంతా వైసీపీదే అని విజయనగరం జిల్లా వాసులు అంటున్నారు అంటే ఫ్యాన్ పార్టీ నేతలు ఆలోచించాలిగా.