Begin typing your search above and press return to search.

అన్ని కళ్ళూ ఆయన వైపే చూస్తున్నాయిట ...ఎందుకంటే... ?

By:  Tupaki Desk   |   12 Feb 2022 1:30 AM GMT
అన్ని కళ్ళూ ఆయన వైపే చూస్తున్నాయిట  ...ఎందుకంటే... ?
X
ఒక్కొక్కరిది ఒక్కో అనుభవం. ప్రతీ ఒక్కరిదీ సెపరేట్ స్టోరీ. వారు రాజకీయల్లో ఈనాటి వారు కాదు, ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారే. దిగ్గజ నేతలు అని అంతా పిలుచుకునే కొలుచుకునే నేతలు. అలాంటి వారు ఇపుడు అంటున్న మాటలు, వేస్తున్న సెటైర్లు వింటూ ఉంటే అవునా, ఏపీలో రాజకీయాలు ఇలా సాగుతున్నాయా అన్న కొత్త డౌట్లు రాక మానవు.

విషయానికి వస్తే ఆయన విజయనగరం సంస్థానానికి వారసుడు. ఘన చరిత్రతో పాటు, రాజకీయంగా కూడా సుదీర్ఘమైన అనుభవం ఉంది. రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలాంటి అశోక్ నోటి వెంట వస్తున్న కొన్ని మాటలు వింటే షాక్ తినాల్సి వస్తోంది. ఇంతకీ రాజా వారు ఏమంటున్నారు అంటే నా వైపు చాలా కళ్ళు చూస్తున్నాయని. నేను ఎక్కడ తప్పు చేస్తానో అని నిఘా పెడుతున్నారు అని.

ఏ మాత్రం తప్పు దొరికినా నన్ను ఇరికించేద్దామని ఆ కళ్ళు ఎపుడూ నన్ను వెతుకుతూనే ఉంటున్నాయని అన్నారు. ఈ మాటలకు అర్ధాలు వేరేగా వెతకాల్సిన పని లేదు. ఆయన ఇండైరెక్ట్ గా వైసీపీ ప్రభుత్వం మీదనే కామెంట్స్ చేశారు. మాన్సాస్ చైర్మన్ తో పాటు సింహాచలం ట్రస్ట్ చైర్మన్ పదవుల నుంచి సరిగ్గా రెండేళ్ల క్రితం అశోక్ ని వైసీపీ సర్కార్ తొలగించింది. ఏడాది పాటు పోరాడిన తరువాత ఆయన మళ్ళీ తన పోస్టులను దక్కించుకున్నారు.

కానీ నాటి నుంచి ప్రభుత్వం సహకారం తనకు ఏ కోశానా లభించడంలేదని మీడియా ముందు చెబుతూనే ఉన్నారు. ఇపుడు చూస్తే తన మీదనే అన్ని కళ్ళూ ఉన్నాయని, తప్పు చేస్తే ఇరికించి బాధ్యతల నుంచి తొలగించాలని తాపత్రపడుతున్నారని అశోక్ అంటున్నారు. అయినా కూడా తాను ఎపుడూ తప్పు చేయనని, ఆ దేవుడి దయతో ఆయన ఆశీస్సులు ఉన్నంతవరకూ తప్పులు జరగకుండా సదా అప్రమత్తంగా ఉంటాను అని అశోక్ ఒట్టేసి మరీ చెబుతున్నారు.

మొత్తానికి అశోక్ పదవిలోకి వచ్చారు కానీ ప్రభుత్వం వైపు నుంచి అధికారుల సహాయ నిరాకరణ కొనసాగుతోంది అని మధన పడుతున్నారు. మరో వైపు తనని తప్పించాలని చూస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. అంటే రాజా వారు నిత్యం ఇలా అభద్రతాభావంతో ఉంటూ ఏలిన వారితో ఫైట్ చేయాల్సిందేనా అన్నదే అనుచరుల అభిమానుల ఆవేదన. పెద్దాయన, ఉత్తరాంధ్రాలో అత్యంత కీర్తి ప్రతిష్టలు కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తిని ఆయన మానాన పని చేసుకోనిస్తే అందరికీ మంచిగా ఉంటుంది కదా. ఏమో వర్తమానంలో ఎక్కడ చూసినా దిగజారుడు రాజకీయాలే కనిపిస్తున్నాయి. అందుకే ఎప్పటికీ ఇలాగే కధ సాగుతుందేమో మరి.