Begin typing your search above and press return to search.
అశోక్ మళ్ళీ పార్లమెంట్ కేనట... ?
By: Tupaki Desk | 18 March 2022 12:30 AM GMTవిజయనగరం జిల్లాకు చెందిన పూసపాటి వారసుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుని మరోసారి ఎంపీగానే పోటీ చేయించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు అంటున్నారు. 2014 ఎన్నికల్లో అశోక్ కి ఇష్టం లేకపోయినా బాబు బలవంతం మీద ఎంపీగా బరిలోకి దిగారు, గెలిచారు. అప్పట్లో బీజేపీతో ఉన్న పొత్తు కారణంగా కేంద్ర మంత్రి కూడా అయ్యారు. కీలకమైన పౌర విమాన యాన శాఖను నాలుగేళ్ల పాటు చూశారు. మోదీ మెచ్చిన సమర్ధుడైన మంత్రిగా పేరు తెచ్చుకున్నారు.
ఇక 2019 ఎన్నికల్లో తిరిగి విజయనగరం నుంచి ఎంపీగా అశోక్ పోటీ చేసినా జగన్ వేవ్ లో ఓడిపోయారు. అయితే 2024 నాటికి పరిస్థితులు పూర్తిగా మారుతాయని టీడీపీ అంచనా వేస్తోంది. ఇక గత మూడేళ్లలో అశోక్ ని టార్గెట్ చేసుకుని వైసీపీ సర్కార్ మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం విషయంలో చేసిన కొన్ని దూకుడు చర్యల వల్ల సానుభూతి ఆయనకు విపరీతంగా పెరిగింది అని పార్టీ అంచనా వేసుకుంటోంది.
దాంతో అశోక్ ని మరోసారి ఎంపీగా పోటీలోకి దించితే ఆయనతో పాటు ఆ లోక్ సభ పరిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్ధులు గెలుస్తారు అని పార్టీ లెక్కలు వేసుకుంటోంది. అయితే అశోక్ వయసు మరో రెండేళ్లకు 73 దాటుతాయి. దాంతో ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని చూస్తున్నారు. తనకు బదులుగా తన కుమార్తెకు విజయనగరం అసెంబ్లీ సీటు ఇవ్వాలని కోరుతున్నారు.
కానీ బీసీ కాపు సామాజిక వర్గ సమీకరణల వల్ల ఈసారి ఆ సీటు ఇవ్వడం వీలు కాకపోవచ్చు అని అంటున్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఉన్నారు. ఆమె కాపు సామాజికవర్గం నుంచి చురుకైన నేత. గతంలో గెలిచిన అనుభవం ఉంది. ఆమెకు చంద్రబాబు ఆశీర్వాదం కూడా ఉంది. దాంతో అసెంబ్లీ సీటుకు బదులు అశోక్ కే ఎంపీ సీటు ఇచ్చి ఆ రాజ కుటుంబం మద్దతు గణనీయంగా పొందాలని టీడీపీ ఆశిస్తోంది.
కానీ ఈ ప్రతిపాదనకు అశోక్ ఎంతవరకూ అంగీకరిస్తారు అన్నదే చర్చ. ఇక అసెంబ్లీ టికెట్ తన కుమార్తెకు ఇవ్వకపోతే రాజకీయాల నుంచే తప్పుకోవాలని కూడా అశోక్ కఠిన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు అని కూడా అంటున్నారు. మొత్తానికి విజయనగరంలో అన్ని రకాలుగా పలుకుబడి కలిగిన పూసపాటి వంశీకులను టీడీపీ ఎలా దారిలోకి తెచ్చుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా టీడీపీకి ఈ రోజుకీ కట్టుబడి ఉన్న సీనియర్ నేతగా అశోక్ కి చంద్రబాబు ఎంతో విలువ ఇస్తారు. అశోక్ కూడా పార్టీ శ్రేయస్సు దృష్ట్యా మరోమారు పోటీకి సిద్ధపడతారు అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి.