Begin typing your search above and press return to search.
ప్రత్యేక హోదా కోసం రాజుగారి కొత్త పరిష్కారం
By: Tupaki Desk | 23 May 2016 4:33 AM GMTపూసపాటి అశోక్ గజపతిరాజు. సీనియర్ తెలుగుదేశం నాయకుడు అయిన రాజుగారు ప్రస్తుత కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా ఉన్నారు. సహజంగా సౌమ్యుడిగా పేరున్న ఉన్న అశోక్ గజపతి రాజు అన్ని అంశాలపై పెద్దగా స్పందించారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం పెద్ద ఎత్తున నలుగుతున్న నేపథ్యంలో ఆ గౌరవం దక్కడం గురించి ఆసక్తికరమైన ప్రకటన చేశారు. విజయనగరంలో జిల్లా మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం విస్తృత చర్చ జరగాలన్నారు.
ప్రజాస్వామ్య దేశంలో ఏ విషయమైనా ప్రజలకు అర్ధమయ్యేలా గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకూ చర్చ అవసరమని అశోక్ గజపతిరాజు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రజల్లో చర్చ జరగాలని ఆ చర్చతో సమస్యకు అర్ధం వస్తుందన్నారు. చర్చమానేయడంతో విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని పేర్కొంటూ మళ్లీ చర్చ ప్రారంభించడంతో ముందుకెళ్తున్నామన్నారు. చర్చకే పరిమితం కాకుండా అందులో నుంచి వచ్చిన నిర్ణయాలు ఆచరణ రూపంలోకి తీసుకోవాలన్నారు. ఆరోజుల్లో చర్చవల్లే ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారన్నారు.
అలాంటి వాతావరణం లేకపోవడం వల్లే దేశంలో విడిపోయిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని తెలిపారు. అందుకే విస్తృతస్థాయి చర్చకు పార్టీ శ్రేణులు క్రియాశీలంగా కృషిచేయాలని అశోక్ గజపతి రాజు సూచించారు.