Begin typing your search above and press return to search.
రాజు గారి మాటః హోదాపై క్లారిటీలేదు
By: Tupaki Desk | 19 Sep 2016 4:45 AM GMTకేంద్ర పౌర విమానాయానశాఖామంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు సుదీర్ఘ కాలం తర్వాత ప్రత్యేక హోదాపై పెదవి విప్పారు. ప్యాకేజీ ప్రకటించిన సందర్భంగా, అనంతరం కూడా ఎక్కడా తెరమీదకు రాని రాజుగారు శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో పర్యటన నిమిత్తం వచ్చిన సందర్భంగా విలేర్లతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై ప్రశ్నించినప్పుడు అశోక్ గజపతిరాజు కొంత అసహనానికి గురయి అనంతరం తన అభిప్రాయం తెలియజేశారు.
ప్రత్యేక హోదా అంశం జాతీయస్థాయిలో చర్చించాల్సిన అంశమని, దీనిపై వేరే సందర్భంలో మాట్లాడతానని అశోక్ గజపతిరాజు తప్పించుకొనే ధోరణిలో మాట్లాడారు. అయినప్పటికీ వాస్తవాలు చెప్తున్నానంటూ ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ - రాష్ట్ర ప్రభుత్వంపై భరోసాతో ఉన్నారని చెప్పారు. తాము కేంద్ర మంత్రులుగా అనేక సందర్భాల్లో ప్రధానమంత్రికి ఈ విషయాన్ని వెల్లడించినట్లు అశోక్ గజపతిరాజు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ప్రత్యేకంగా ఢిల్లీకి పదుల సార్లు ఈ విషయంలోనే వచ్చి ప్రధానమంత్రి సహా మంత్రులను కలిశారని గుర్తుచేశారు. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కొందరు, ప్యాకేజీ కావాలని మరికొందరు డిమాండ్ చేయడంతో దానిపై స్పష్టత ఇవ్వలేమని అన్నారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేయడం సరికాదని అశోక్ గజపతిరాజు తప్పుపట్టారు. రాష్ట్ర అభివృద్ధికి అంతా కలిసి ముందుకు సాగాలని కోరారు.