Begin typing your search above and press return to search.
పవన్ కు రాజుగారి అదిరిపోయే పంచ్
By: Tupaki Desk | 14 Aug 2018 6:20 AM GMTటీడీపీతో సాన్నిహిత్యంగా ఉన్నన్నీ నాళ్లు పవన్ గురించి ఒక్క మాట అనని టీడీపీ నేతలు.. ఎప్పుడైతే చంద్రబాబును పవన్ తిట్టడం మొదలుపెట్టారో.. అప్పటి నుంచి యుద్ధం స్ట్రాట్ చేశారు. పవన్ గివన్ జాన్తా నై అన్నట్టు పరుషంగా విమర్శలు చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అయితే ఏకంగా పవన్ ఎవరో తెలియదని.. ఆయన సినిమాలు చూడలేదని అప్పట్లో అనేసి పెద్ద సంచలనమే సృష్టించారు.
దీనిపై అశోక్ గజపతి రాజుకు పవన్ పలుమార్లు గట్టి సమాధానాలే ఇచ్చారు. వీరిద్దరి వార్ ముగిసిపోయిందనుకుంటున్న తరుణంలో మారోసారి అశోక్ గజపతిరాజు ఓ ఇంటర్వ్యూలో పవన్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఆ రోజు పవన్ తెలియదు అన్న మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. ‘ఎన్టీఆర్ సినిమాలే తాను చూడలేదు.. పవన్ వి ఎందుకు చూస్తాను విజయనగరంలో ప్రచారానికి వచ్చినప్పుడు కూడా తాను, పవన్ కలిసి ప్రచారం చేయలేదు’ అని అశోక్ గజపతి స్పష్టతనిచ్చారు.
‘తాను సీరియస్ రాజకీయాలు చేసే వారి గురించే మాట్లాడుతానని.. వారిలో సీరియస్ నెస్ లేకుంటే పట్టించుకోనని’ పవన్ ది సీరియస్ పాలిటిక్స్ కాదని అశోక్ గజపతి హాట్ కామెంట్ చేశారు. తాను కేంద్రమంత్రిగా చేసిన సమయంలోనూ చాలా మంది గుర్తుపట్టలేదన్నారు. అలాంటిది పవన్ గురించి తనకు ఎలా తెలుస్తుందని సెటైర్ వేశారు. ఇక తాను సినిమాలు చూసేదే తక్కువని.. అందులోనూ తెలుగు సినిమాలు అస్సటు చూడనని.. అలాంటప్పుడు పవన్ సినిమాలు చూసే చాన్సే లేదని వివరించారు. అందుకే తనకు పవన్ తెలియదని చెప్పానని బదులిచ్చాడు.