Begin typing your search above and press return to search.

రామతీర్థ ఎఫెక్ట్: అశోక్ గజపతికి షాకిచ్చిన ఏపీ సర్కార్

By:  Tupaki Desk   |   2 Jan 2021 2:43 PM GMT
రామతీర్థ ఎఫెక్ట్: అశోక్ గజపతికి షాకిచ్చిన ఏపీ సర్కార్
X
విజయనగరం రామతీర్థ ఆలయంలో విగ్రహాలు ధ్వంసం కావడం.. ఈరోజు చంద్రబాబు, మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజు సహా టీడీపీ నేతలు రచ్చ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ గా స్పందించింది. ఆలయ నిర్వహణలో వైఫల్యం చెందిన నేపథ్యంలో పదవి నుంచి తొలగిస్తూ దేవాదాయశాఖ కార్యదర్శి గిరిజాశంకర్ మెమో జారీ చేశారు.

విజయనగరం జిల్లాలో రామతీర్థ ఘటన నేపథ్యంలో ఆ ఆలయాలకు చైర్మన్ గా ఉన్న విజయనగరం రాజవంశీకుడు, మూడు ప్రముఖ దేవస్థానాల ధ్మరకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజుకు జగన్ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనను మూడు ప్రముఖ దేవస్థానాల ధ్మరకర్తగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

విజయనగరం పైడితల్లి, మందపల్లి ఆలయం, రామతీర్థం రామాలయంల ధర్మకర్త హోదా నుంచి అశోక్ గజపతిరాజును తాజాగా ఏపీ ప్రభుత్వం తొలగించింది. ఆయనకు హోదాను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన జీవో 65ను ఉపసంహరిస్తూ దేవాదాయశాఖ మెమో ఇచ్చింది. తాజా పరిణామంపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి.

ఇప్పటికే వైఎస్ జగన్ సర్కార్ గతంలో అశోక్ గజపతిరాజును ప్రతిష్టాత్మక సింహాచల దేవస్థానం చైర్మన్ పదవి నుంచి తొలగించింది. అలాగే విజయనగరం సంస్థానాధీశులకు చెందిన మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్) ట్రస్టు అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించింది. ఇప్పుడు మరో మూడు ఆలయాల పదవుల నుంచి తప్పించింది.