Begin typing your search above and press return to search.
రాజు గారు మాట్లాడారోచ్
By: Tupaki Desk | 17 Feb 2019 9:02 AM GMTటీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు టీడీపీలో ఉన్నట్లా, లేనట్లా.? టీడీపీకి ఆయన రాజీనామా చేయబోతున్నారని..త్వరలో ప్రకటన వస్తుందని రెండు మూడు రోజులుగా ఒకటే వార్తలు. ఆ వార్తలన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టేశారు ఆయన. తాను టీడీపీలో ఉంటానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.
రెండు రోజుల క్రితం టీడీపీ పోలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. పోలిట్ బ్యూరో సభ్యుడైన అశోక్ గజపతి రాజుకి కూడా ఆహ్వానం వెళ్లింది. కానీ ఆయన ఈ సమావేశానికి డుమ్మా కొట్టేశారు. ఇక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కార్యక్రమానికి కూడా రాజు గారు రాలేదు. దీంతో.. కిశోర్ చంద్ర దేవ్ టీడీపీలో చేరే విషయంలో అశోక్ గజపతి రాజు అలకబూనారని.. అందుకే ఆయన పార్టీకి, కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. చంద్రబాబు వ్యవహార శైలిపై సీరియస్ గా ఉన్న అశోక గజపతి రాజు టీడీపీకి రాజీనామా చేయబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి.
తనపై వస్తున్న పుకార్లపై అశోక్ గజపతి రాజు తొలిసారిగా స్పందించారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. తాను టీడీపీ కార్యకర్తననీ, 1982 నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇక పోలిట్ బ్యూరో సమావేశం సమాచారం తనకు ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కుతుండగా వచ్చిందని.. అందుకే తాను హాజరు కాలేకపోయానని చెప్పారు. కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ పార్టీలోకి వస్తే తనకేం అభ్యంతరం లేదని.. ఆయన పార్టీలోకి రావడం స్వాగతించదగ్గ విషయం అని చెప్పి సస్సెన్స్ కి తెరదించారు అశోక గజపతి రాజు.