Begin typing your search above and press return to search.
చంద్రబాబు కంటే అశోక్ గజపతే నయం
By: Tupaki Desk | 27 March 2017 10:59 AM GMTఎంత దాచిపెట్టాలనుకున్నా కూడా బహిరంగంగా చేసిన కొన్ని తప్పులను దాచిపెట్టడం కుదరదు. ఎయిరిండియా ఉద్యోగిని శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చెప్పుతో కొట్టడం... రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని దారుణంగా దూషించడం అలాంటివే. అయితే... ఈ రెండు వివాదాలను పరిశీలించి చూస్తే ఈ వ్యవహారాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు స్పందించిన తీరులో తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కేశినేని వ్యవహారంలో రచ్చ ముదిరితే కష్టమన్న భయంతో ఏపీ సీఎం చంద్రబాబు నానితో క్షమాపణ చెప్పించారు. అయితే... వివాదం పెరగకుండా ఉండాలన్న జాగ్రత్తతో చంద్రబాబు ఆ స్టెప్ తీసుకున్నారే కానీ ఆయన కూడా స్వయంగా దీనిపై ఏమీ బాధపడలేదని... ఇలాంటి చర్యల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తందంటూ నానిని మందలించారే కానీ ఒక సీనియర్ అధికారితో అలా ఎలా మాట్లాడుతారని మాత్రం చెప్పలేకపోయారని.. చంద్రబాబు దాన్నసలు ఇష్యూగా చూడకుండా పార్టీకి కలిగే నష్టం విషయమే ఆలోచించారని అంటున్నారు.
అయితే.. ఇదే సమయంలో ఎయిర్ లైన్స్ ఉద్యోగిని కొట్టిన శివసేన ఎంపీ విషయంలో మాత్రం కేంద్ర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు నిర్మొహమాటంగా తన అభిప్రాయం చెప్పేశారు. ఒక ఎంపీ ఇలా ప్రవర్తిస్తాడని తాను కలలో కూడా ఊహించలేదంటూ తన అసంతృప్తిని బాహాటంగా వెల్లగక్కారు. అంతేకాదు.. ఈ ఇష్యూలో ఎయిర్ ఇండియా ఉద్యోగుల తప్పేమీ లేదని చెబుతూ వారిని వెనకేసుకొచ్చారు కూడా. అది కూడా శివసేన నేతలతోనే ఆ విషయం చెప్పారాయన.
భారత విమానయాన రంగంలో తమ దాదాగిరిని చూపించేందుకే ఓ ఎంపీని విమానాలు ఎక్కకుండా నిషేధించారని రాజ్యసభలో శివసేన సభ్యులు విరుచుకుపడ్డారు. రవీంద్ర గైక్వాడ్ ఉదంతాన్ని ప్రస్తావించిన శివసేన సభ్యుడు ఆనందరావ్, ఈ విషయంలో స్పీకర్ కల్పించుకోవాలని, పరిస్థితిని ఆయన చక్కదిద్దకుంటే, హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెడతామని హెచ్చరించారు. విమానంలో మద్యం సేవించి హంగామా చేసిన కపిల్ శర్మపై చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. శివసేనకు మద్దతుగా ఇతర పార్టీల సభ్యులు సైతం మాట్లాడారు. ఆ సమయంలో కల్పించుకున్న విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, ఓ పార్లమెంట్ సభ్యుడు ఇలా ప్రవర్తిస్తాడని తాను కలలో కూడా అనుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎయిర్ లైన్స్ తప్పున్నట్టు తాను భావించడం లేదని, జరిగిన సంఘటనకు కనీసం చింతిస్తున్నట్టయినా గైక్వాడ్ చెప్పి ఉండాల్సిందని సలహా ఇచ్చారు.
కాగా రవాణా శాఖ కమిషనర్ ను దూషించిన కేశినేని నానికి అశోక్ సహచర ఎంపీనే కావడం విశేషం. ఇద్దరూ టీడీపీవారే. నాని విషయంలో చంద్రబాబు ఇలాంటి అభిప్రాయం వ్యక్తంచేయలేకపోగా అదే పార్టీకి చెందిన అశోక్ గజపతి మాత్రం నిర్మొహమాటంగా ఇలాంటి తీరును వ్యతిరేకించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/