Begin typing your search above and press return to search.
బాబుకు షాకిచ్చిన అశోకగజపతిరాజు
By: Tupaki Desk | 19 July 2015 4:24 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు టైం ఏమాత్రం బాగోలేనట్లుగా ఉంది. విపక్షాల విమర్శలతో ఒకవైపు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆయనకు.. సొంత మనుషులు రియాక్ట్ అవుతున్న తీరుకు నోట మాట రాని పరిస్థితి. తాజాగా విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు నోటి వెంట వచ్చిన మాటలతో బాబు షాక్ తినే పరిస్థితి.
పార్టీ పార్లమెంటరీ సమావేశం సందర్భంగా కేంద్రం వద్ద పెండింగ్ ఉన్న అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పెండింగ్ ఇష్యూలను మరోకేంద్రమంత్రి సుజనా చౌదరి చదివి వినిపించారు. ఏపీలో విమానాశ్రయాల విస్తరణకు అవసరమైన నిధుల్ని కేంద్రం ఇవ్వాల్సి ఉందని చెప్పారు. దీనికి.. స్పందించిన అశోక్ గజపతి.. విభజన చట్టంలో విమానాశ్రాయల విస్తరణకు నిధులు ఇవ్వాలంటూ విభజన చట్టంలో లేదని వ్యాఖ్యానించినట్లు తెలిసిందే.
ఒక పక్క తమ సొంత రాష్ట్రాలకు వీలైనంతగా పనులు చేసుకుంటుంటే.. అశోక్ గజపతి నోటి నుంచి వచ్చిన మాటల్ని జీర్ణం చేసుకోలేని చంద్రబాబు.. చట్టంలో ఉందా? లేదా? అనే అంశం కన్నా.. నిధుల వచ్చే విషయంపై దృష్టి పెట్టాలన్న సూచన చేశారు. మరి.. ఏ మూడ్ లో ఉన్నారో కానీ.. అశోక్ గజపతి రాజు.. ముఖ్యమంత్రి మాటలకు స్పందిస్తూ.. మీరు పార్టీ అధ్యక్షులు.. మీరు నా పదవికి రాజీనామా చేయమంటే.. చేసేస్తా.. మీకు ఆ అధికారం ఉందన్న మాట రావటంతో బాబు విస్తుపోయినట్లు చెబుతున్నారు.
ఓపక్క నిధుల విషయంలో.. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మాంచి స్పీడ్ తో దూసుకెళ్లాలని చూస్తుంటే.. అందుకు భిన్నంగా అశోక్ గజపతి రాజు నోటి నుంచి వచ్చిన మాటతో మిగిలిన సభ్యులంతా నోట మాట రాకుండా నిశ్చేష్టులయినట్లు చెబుతున్నారు. ఏపీ ప్రయోజనాల ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడితే.. అందుకు భిన్నంగా అశోక్ గజపతి రూల్ బుక్ లోని రూల్స్ గురించి మాట్లాడటం ఏమిటో..?