Begin typing your search above and press return to search.
ఈసారి కూతురు పార్లమెంటుకి.. తండ్రి అసెంబ్లీకి పోటీ!
By: Tupaki Desk | 8 Aug 2022 8:47 AM GMTపూసపాటి అశోక్ గజపతిరాజు గతంలో ఆరుసార్లు శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే 2014లో విజయనగరం ఎంపీగా ఎన్నికై కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన పౌర విమానయాన శాఖ మంత్రిగానూ పనిచేశారు. కాగా గత ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు ఓడిపోయారు. అలాగే విజయనగరం అసెంబ్లీ నుంచి బరిలోకి దిగిన ఆయన కుమార్తె అదితి గజపతిరాజు కూడా ఓటమి పాలయ్యారు.
కాగా ఈసారి అశోక్ గజపతిరాజు విజయనగరం నుంచి అసెంబ్లీకి.. ఆయన కుమార్తె అదే నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని అశోక్ భావిస్తున్నారని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వస్తుందని.. ఈ క్రమంలో అసెంబ్లీకి పోటీ చేస్తే కేబినెట్ మంత్రిగా చాన్స్ కొట్టేయొచ్చని అశోక్ గజపతిరాజు భావిస్తున్నారని అంటున్నారు.
ఎంపీ పదవికి పోటీ చేసి గెలిచినా ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని.. సాధారణ ఎంపీగా ఉండిపోవాల్సి వస్తుందని అశోక్ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అశోక్ గజపతిరాజు అసెంబ్లీకి పోటీ చేసి.. ఆయన కుమార్తె అదితి గజపతిరాజును పార్లమెంటుకు పోటీ చేయించే యోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
కాగా ప్రస్తుతం వైఎస్సార్సీపీ తరఫున విజయనగరం ఎమ్మెల్యేగా వైశ్య సామాజికవర్గానికి చెందిన కోలగట్ల వీరభద్రస్వామి ఉన్నారు. అయితే ఆయనకు ఇటీవల నియోజకవర్గంలో సొంత పార్టీలోనే అసమ్మతి ఎదురైందని. ఈ మేరకు మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. అసమ్మతి వర్గం జిల్లా కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణకు కోలగట్లపై ఫిర్యాదు కూడా చేసింది.
ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ తరఫున బీసీ అభ్యర్థి విజయనగరం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. లేదా కోలగట్ల కుమార్తె శ్రావణి విజయనగరం అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ నుంచి బరిలోకి దిగొచ్చని చెబుతున్నారు.