Begin typing your search above and press return to search.
అశోక్ హాట్ కామెంట్స్ : రాజావారినే భయపెడుతున్నారా...?
By: Tupaki Desk | 23 Jun 2022 2:30 AM GMTఆయన సాదా సీదా మనిషి కాదు, వందల ఏళ్ళకు పూర్వం ఆయన వంశీకులు ఏకంగా రాజులుగా సంస్థానాలను ఏలారు. వారి నియంత్రణలో నాడు ఎన్నో ఘనమైన ప్రాంతాలు ఉండేవి. అలాంటి చరిత్ర వహించిన పూసపాటి వంశానికి చెందిన ప్రస్తుత తరం వారసుడు అశోక్ గజపతిరాజు వైసీపీ సర్కార్ మీద తాజాగా హాట్ హాట్ కామెంట్స్ చేశారు.
తనను సింహాచలం చైర్మన్ పదవి నుంచి తప్పించేందుకు వైసీపీ నేతలు చూస్తున్నారు అని ఆయన ఆరోపించడం సంచలనం రేపుతోంది. అశోక్ ని 2020 మార్చిలో ఆల్ ఆఫ్ సడెన్ గా తప్పించారు. ఆయన దాని మీద కోర్టుకు వెళ్ళి పోరాడి సాధించుకుని వచ్చారు. మరి ఆ తరువాత రెండేళ్ళూగా ఆయన ఒక విధంగా ప్రభుత్వంతో పోరాడుతూనే పదవిలో ఉన్నారు. ఇక లేటెస్ట్ గా చూస్తే ఆయన తన పదవికి ముప్పు తెచ్చేలా వైసీపీ వారి ఆలోచనలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
చట్టానికి వ్యతిరేకంగా తాను పనిచేస్తే కనుక తక్షణం తనను పదవి నుంచి తప్పించేందుకు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సింహాచలం పాలకవర్గం చేయకూడని పనుల విషయంలో తన మీద వత్తిడి తెస్తున్నారు అని ఆయన ఆరోపించారు. దేవస్థానానికి ప్రభుత్వానికి మధ్య అనేక భిన్నాభిప్రాయాలు ఉంటాయని ఆయన అన్నారు.
ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలను ధర్మకర్తల మండలి తీసుకోలేదని ఆయన అనడం విశేషం. తనను పంచగ్రామాలలో ఉన్న ఇళ్ళ మరమ్మతులకు సంబంధించి తీర్మానం చేయమని కోరుతున్నారని, అయితే తాను అలాంటి దుస్సాహసం చేయలేనని అశోక్ అంటున్నారు. దీని మీద సభ్యులు ప్రతిపాదన పంపించినట్లైతే న్యాయపరమైన సలహాలు తీసుకుని చట్టబద్ధంగా అవి ఉంటేనే ఆమోదిస్తాను తప్ప లేకుంటే లేదని చెప్పేస్తాను అని ఆయన స్పష్టం చేస్తున్నారు.
ఒక వైపు పంచగ్రామాల మీద తీర్మానం చేయాలని తన మీద వత్తిడి తెస్తూనే మరో వైపు తనను తొలగించాలని సంబంధిత మంత్రి మీద ఎంపీ విజయసాయిరెడ్డి గట్టిగా ప్రయంత్నాలు చేస్తున్నారు అని అశోక్ ఆరోపించడం విశేషం. పంచగ్రామలకు సంబంధించి పాలకవర్గం చట్టాన్ని ఏ రూపేణా అధిగమించలేదని అశోక్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే గత దేవాదాయ శాఖ మంత్రి తనను తొలగిస్తాను అని పదే పదే బాహాటంగానే అంటూండేవారని, ఇపుడు కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని వైసీపీ పెద్దల మీద చేస్తున్న ఆరోపణలు జనాలలో చర్చనీయాంశం అవుతున్నాయి. మరి రాజు గారికే బెంగ పుట్టించేలా వైసీపీ పెద్దలు అనేక రకాలుగా వత్తిళ్ళు తెస్తున్నారా. రాజావారితో రచ్చకు ఫుల్ స్టాప్ లేదా అసలు ఎందుకు ఇలా జరుగుతోంది. టార్గెట్ ఏంటి అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.