Begin typing your search above and press return to search.
గెహ్లాత్ డబల్ యాక్షన్ మొదలవ్వబోతోందా ?
By: Tupaki Desk | 27 Nov 2020 1:30 AM GMTరాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాత్ తొందరలో డబల్ యాక్షన్ మొదలుపెట్టబోతున్నారట. ఇప్పటికే రాజస్ధాన్ ముఖ్యమంత్రిగా ఉన్న గెహ్లాత్ తొందరలోనే కాంగ్రెస్ చీఫ్ కు రాజకీయ వ్యవహారాల సలహాదరుగా నియమితులవ్వబోతున్నట్లు ప్రచారం మొదలైంది. నిన్నటి వరకు సోనియాగాంధీకి సలహాదారుగా అహ్మద్ పటేల్ ఉన్న విషయం తెలిసిందే. అయితే అహ్మద్ కరోనా వైరస్ కారణంగా బుధవారం మరణించారు. దాంతో ఇపుడు ఆ స్ధానాన్ని భర్తీ చేయాల్సిన అవసరం వచ్చింది. సలహాదారు హోదాలో అహ్మద్ దశాబ్దాల పాటు కంటిన్యు అయ్యారు. అంతటి గట్టి నేత, అనుభవజ్ఞుడు ఎవరున్నారనే విషయమై పార్టీలో చర్చ మొదలైందట.
అనేకమంది నేతలను వడబోసిన తర్వాత అందరికన్నా గెహ్లాతే సరైన నేతగా తేలినట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. గెహ్లాత్ అయితే ఇటు సోనియాగాంధికి అటు రాహూల్ గాంధీకి కూడా సన్నిహితులే. ఇపుడు సోనియా తాత్కాలిక అధ్యక్షురాలిగా కంటిన్యు అవువుతున్నారు. ఈరోజే రేపో సోనియా స్ధానంలో రాహూల్ పగ్గాలు అందుకోవటం ఖాయం. అనారోగ్య కారణాలతో తొందరలోనే పార్టీ బాధ్యతలన్నింటి నుండి సోనియా తప్పుకోబోతున్నట్లు నేతలే చెప్పుకుంటున్నారు. ఇటువంటి సమయంలో రాహూల్ కు అన్నీ విధాలుగా అండగా నిలబడే నేత ఎవరైనా ఉన్నారంటే అది గెహ్లాత్ మాత్రమే అని కాంగ్రెస్ సర్కిళ్ళల్లో చర్చ మొదలైంది.
మొదటినుండి కూడా గెహ్లాత్ యువరాజు రాహూల్ గుడ్ లుక్స్ లోనే ఉన్నారు. రాహూల్ ఏ బాధ్యతలు అప్పగించినా సక్సెస్ ఫుల్లుగా నెరవేరుస్తాడనే ప్లస్ పాయింట్ ఉంది గెహ్లాత్ కు. అందుకనే రాహూల్ పగ్గాలు అందుకోగానే రాజస్ధాన్ సీఎం వెంటనే రాజకీయ వ్యవహారాల సలహాదారుగా రెండో పాత్ర కూడా పోషించబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఒకేసారి రెండు పాత్రలు పోషించటం మామూలుగా అయితే కష్టమే. కానీ పార్టీ ఇపుడున్నపరిస్ధితుల్లో గెహ్లాత్ కు అదేమీ పెద్ద కష్టం కాబోదనే అనుకుంటున్నారు.
సోనియా-అహ్మద్ కు కుదిరినట్లు రాహూల్ తో అహ్మద్ కు కుదరలేదు. దాంతో యువరాజకు కొన్ని చికాకులు తలెత్తిన విషయం తెలిసిందే. కారణాలు ఏవైనా అధ్యక్ష బాద్యతల నుండి రాహూల్ తప్పుకున్న విషయం తెలిసిందే. సరే పార్టీ ఇపుడు కష్టకాలంలో ఉన్నపుడు సీనియర్లలో ఎవరైనా డ్యామేజింగ్ గా మాట్లాడితే వెంటనే గెహ్లాత్ వాళ్ళకు కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. దాంతో సీనియర్లలో గెహ్లాత్ మాత్రమే రాహూల్ కు అన్నీ విధాల సరిపోయే జోడీగా అర్ధమైపోయింది. కాబట్టి తొందరలోనే అశోక్ గెహ్లాత్ ఇటు సీఎంగా అటు సలహాదారుగా డబల్ యాక్షన్ మొదలు పెట్టే సమయం వచ్చేస్తోంది.