Begin typing your search above and press return to search.

గెహ్లాట్ - కమల్ నాథ్ ప్రమాణ స్వీకారం..

By:  Tupaki Desk   |   17 Dec 2018 10:32 AM GMT
గెహ్లాట్ - కమల్ నాథ్ ప్రమాణ స్వీకారం..
X
హిందీ బెల్ట్ లోని కీలకమైన మూడు రాష్ట్రాల్లో అధికార మార్పిడి బీజేపీ నుంచి కాంగ్రెస్ కు దిగ్విజయంగా సోమవారం పూర్తయ్యింది. రాజస్థాన్ లో సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ సీఎం పీఠం అధిష్టించగా.. సచిన్ పైలెట్ డిప్యూటీ సీఎంగా నియామకమయ్యారు. ఇక మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్ అధికారం చేపట్టాగా.. చత్తీస్ ఘడ్ లో భూపేష్ బెగల్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ మధ్యప్రదేశ్ 18వ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ 72ఏళ్ల కమల్ నాథ్ తో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - మాజీ ప్రధాని మన్మోహన్ సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ - కాంగ్రెస్ సీనియర్లు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా కమల్ నాథ్ కాస్త కంగారు - భయంతో కనిపించారు.

ఇక చత్తీస్ ఘడ్ సీఎంగా భూపాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ - నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా.. ఏపీ సీఎం చంద్రబాబు - లోక్ తాంత్రిక్ జనతా దల్ లీడర్ శరద్ యాదవ్ - డీఎంకే స్టాలిన్ - ఆర్జేడీ తేజస్వి యాదవ్ హాజరయ్యారు.

రాజస్థాన్ లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో అశోక్ గెహ్లాట్ సంప్రదాయ రాజస్తాన్ వేషధారణలో అలరించారు. రాజస్తాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సమావేశానికి రాహుల్ - మన్మోహన్ హాజరయ్యారు.