Begin typing your search above and press return to search.

కెరీర్ లో 52వ సారి బ‌దిలీ అయ్యారు!

By:  Tupaki Desk   |   4 March 2019 6:15 AM GMT
కెరీర్ లో 52వ సారి బ‌దిలీ అయ్యారు!
X
మోడీ హ‌యాంలో అవినీతి అన్న‌ది లేద‌ని.. కుంభ‌కోణాలు అస్స‌లే లేవ‌న్న మాట జోరుగా వినిపిస్తున్న‌వేళ‌.. ప‌లు అవినీతి నిద‌ర్శ‌నాలు.. రాఫెల్ స్కాం బ‌య‌ట‌కు వ‌చ్చి మాట‌ల కోసం వెతుక్కునే ప‌రిస్థితి. కొంద‌రైతే ఏకంగా బీజేపీకి.. కాంగ్రెస్ కు పెద్ద తేడా లేద‌ని..రెండు పార్టీల పాల‌న ఒకేలా ఉంద‌ని మండిప‌డే వారు లేక‌పోలేదు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. నీతిగా..నిజాయితీగా.. ముక్కుసూటిగా ఉండే వారికి తిప్ప‌లు త‌ప్ప‌వ‌న్న విష‌యం తాజాగా మ‌రోసారి రుజువైంది. ప‌వ‌ర్లో మోడీ ఉన్నా.. మ‌న్మోహ‌న్ ఉన్నా.. మ‌రెవ‌రు ఉన్నా ముక్కుసూటి అధికారుల‌పై బ‌దిలీ వేటు త‌ప్ప‌ద‌న్న వైనం స్ప‌ష్ట‌మైంది.

1991 బ్యాచ్ కు చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా తాజాగా మ‌రోసారి బ‌దిలీ అయ్యారు. ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కూ 52 సార్లు బ‌దిలీ అయ్యారు. హ‌ర్యానా కేడ‌ర్లో ప‌ని చేసే ఆయ‌న తాజాగా త‌న కెరీర్ లో 52వ సారి బ‌దిలీ అయ్యారు. తాజాగా తొమ్మిది మంది ఐఏఎస్ ల‌ను బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేయ‌గా.. అందులో అశోక్ ఖేమ్కా పేరు ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

అశోక్ ఖేమ్కా ఎవ‌రంటే.. 2012లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు.. డీఎల్ఎఫ్ కు మ‌ధ్య కుదిరిన భూ ఒప్పందాన్ని ర‌ద్దు చేసి వార్త‌ల్లో నిలిచారు. ప‌వ‌ర్లో ఉన్న పార్టీకి చెందిన కీల‌క వ్య‌క్తి ల‌బ్థి దెబ్బ తినేలా ఆయ‌న నిర్ణ‌యం ఉండ‌టంతో సంచ‌ల‌నంగా మారింది. దీంతో అశోక్ పేరు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. నిజాయితీతోపాటు.. క‌చ్ఛిత‌మైన నిర్ణ‌యాలు తీసుకునే స‌త్తా అశోక్ కు ట‌న్నుల లెక్క ఉంద‌ని.. అందుకే ఆయ‌నపై త‌ర‌చూ బ‌దిలీ వేటు ప‌డుతుంద‌ని చెబుతుంటారు. అంకిత భావంతో ప‌ని చేసే ఆయ‌న‌కు ట్రాన్స‌ఫ‌ర్లు బ‌హుమానాలు వ‌స్తుంటాయ‌న్న పేరుంది.

త‌న కెరీర్ లో అత్యున్న‌త స్థాయి నేత‌ల అవినీతి చిట్టాల‌తో పాటు..గ‌లీజు ఒప్పందాలు.. ప్ర‌భుత్వ ఖ‌జానాకు న‌ష్టం వాటిల్లే నిర్ణ‌యాల‌పై ఆయ‌న క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. హ‌ర్యానా మాజీ సీఎం భూపేంద‌ర్ సింగ్ హుడా పాల‌న‌లో చోటు చేసుకున్న అనేక కుంభ‌కోణాల‌ను బ‌య‌ట‌పెట్టిన అశోక్.. తాజాగా ఆరావ‌ళీ ప‌ర్వ‌త శ్రేణుల్లో భూఏకీక‌ర‌ణ గురించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు బ‌హుమానంగా బ‌దిలీ వేటు ప‌డిన‌ట్లు చెబుతారు. త‌న కెరీర్ లో ఎన్నో బ‌దిలీ వేట్ల‌ను చూసిన అశోక్ తాజా ప‌రిణామం కొత్తేం కాకున్నా.. ముక్కుసూటిగా పని చేసే అధికారిని ఏ పార్టీ ప్ర‌భుత్వంలో ఉన్నా భ‌రించ‌లేద‌న్న విష‌యం తాజా బ‌దిలీతో స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మోడీ మాష్టారు.. మీ పార్టీకి చెందిన ఈ నిర్ణ‌యం మీద మీరేమైనా స్పందిస్తారా?