Begin typing your search above and press return to search.
వైసీపీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై
By: Tupaki Desk | 26 May 2016 11:25 PM ISTస్వల్ప విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ ఆకర్ష్ తిరిగి ప్రారంభమయినట్లు కనిపిస్తోంది. మరో ఎమ్మెల్యే వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెదేపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఈరోజు ఆయన రాచర్ల మండలానికి చెందిన కార్యకర్తలతో సమావేశమై చర్చించారు. కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీ మార్పుపై ఆయన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
రాజ్యసభ ఎన్నికల ప్రకటన విడుదలయిన నేపథ్యలో ఈ పిరాయింపు నిర్ణయం కలకలం రేపుతోంది. వైసీపీ తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో అశోక్ రెడ్డి తన సన్నిహితులతో సమావేశం అవడం వైసీపీకి ఝలక్ గా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికీ వైసీపీ నుంచి 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించిన సంగతి తెలిసిందే.