Begin typing your search above and press return to search.

తెలుగు బిడ్డ చేతికి ఇన్ఫోసిస్ ప‌గ్గాలు

By:  Tupaki Desk   |   4 Nov 2017 8:07 AM GMT
తెలుగు బిడ్డ చేతికి ఇన్ఫోసిస్ ప‌గ్గాలు
X
ఐటీ సేవ‌ల సంస్థ‌ల్లో దేశీయ దిగ్గ‌జం ఇన్ఫోసిస్ ర‌థ‌సార‌థిగా తెలుగు బిడ్డ ఎంపిక‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇన్ఫోసిస్‌ కొత్త సీఈవోగా ఆ సంస్థ మాజీ ఉద్యోగి - తెలుగు వ్య‌క్తి అశోక్‌ వేమూరి నిమితులయ్యే చాన్స్ ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. కొత్త చైర్మెన్‌ ఎంపిక కోసం ఏర్పాటు చేసిన నామినేషన్‌ కమిటీ విశాల్‌ సిక్కా స్థానంలో మాజీ ఉద్యోగి అశోక్‌ వేమూరి అభ్యర్థిత్వం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.

వేమూరి గతంలో ఇన్ఫోసిస్‌లో వివిధ హోదాల్లో పని చేశారు. సంస్థ పని విధానం గురించి ఆయనకు సమగ్ర అవగాహన ఉంది.అమెరికాలో ఇన్ఫోసిస్‌ కార్యకాలాపాలకు అధినేతగా కూడా పని చేసిన అపార అనుభవం వేమూరి సొంతం. ఈ నేపథ్యంలో సీఈవో ఎంపిక కమిటీ వేమూరి పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. వేమూరి గతంలో ఐగేట్‌ కార్పొరేషన్‌ అధినేతగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయన జిరాక్స్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ సీఈవోగా పని చేస్తున్నారు. వేమూరితో చర్చలు తొలి దశలో ఉన్నట్టుగా సంస్థ వర్గాలు చెబుతున్నాయి. సీఈవోగా నిమించే విషయమై ఇన్ఫోసిస్‌ వర్గాలు ఇప్పటికే వేమూరిని సంప్రదించినట్టు.. ఈ వ్యవహారంతో దగ్గరగా సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. అయితే ఆయన ఈ ప్రతిపాదన విషయమై వేమూరి తన స్పందనను వెల్లడించాల్సి ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఐగేట్‌ సంస్థ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఆ సంస్థ పగ్గాలను చేపట్టి మేటిగా తీర్చిదిద్దిన ఘనత వేమూరి సొంతం. దీనికి తోడు ఇన్ఫోసిస్‌ వ్యాపారానికి ఆయువు పట్టయిన అమెరికా కార్యాలయాల్లో పని చేసి కొత్త వ్యూహాలతో ఆర్డర్లను సాధించడంలో వేమూరి సిద్ధహస్తులు.. ఇవే అంశాలు ఆయన్ని సీఈవో పీఠానికి దగ్గర చేస్తున్నట్టుగా సమాచారం. దీంతో త్వరలోనే ీ నియామకం జరగనున్నట్లు