Begin typing your search above and press return to search.

టీడీపీ సమావేశానికి అశోక గజపతి డుమ్మా.. ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   2 April 2021 9:30 AM GMT
టీడీపీ సమావేశానికి అశోక గజపతి డుమ్మా.. ఏం జరుగుతోంది?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల క‌మిష‌న్ జారీచేసిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ పై చ‌ర్చించేందుకు టీడీపీ పొలిట్ బ్యూరో ఇవాళ‌ స‌మావేశమైంది. అయితే.. ఈ స‌మావేశానికి టీడీపీ నేత‌, కేంద్ర మాజీ మంత్రి అశోక గ‌జ‌ప‌తి రాజు డుమ్మా కొట్టిన‌ట్టు తెలుస్తోంది.

ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎస్ఈసీ నీలం సాహ్ని విడుద‌ల చేసిన పాత నోటిఫికేష‌న్ పై టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ అభ్యంత‌రం తెలిపిన విష‌యం తెలిసిందే. కొత్త నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని ఆ పార్టీలు కోరుతున్నాయి. ఈ క్ర‌మంలోనే.. ప‌రిష‌త్‌ ఎన్నిక‌ల‌పై చ‌ర్చించేందుకు ఎల‌క్ష‌న్‌ క‌మిష‌న్ ఏర్పాటు చేసిన‌ స‌మావేశాన్ని కూడా ఈ పార్టీలు బహిష్క‌రించాయి.

ఈ నేప‌థ్యంలో పార్టీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాల‌నే అంశంపై టీడీపీ పొలిట్ బ్యూరో స‌మావేశ‌మైంది. కానీ.. దీనికి అశోక గ‌జ‌ప‌తి గైర్హాజ‌రు కావ‌డం చ‌ర్చ‌నీయాంశమైంది. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ స‌మావేశాన్ని బ‌హిష్క‌రించ‌డం, త‌ద్వారా ఎన్నిక‌ల‌ను బహిష్క‌రించాల‌నే పార్టీ ఆలోచ‌న‌కు నిర‌స‌న‌గానే ఆయ‌న స‌మావేశానికి డుమ్మా కొట్టిన‌ట్టు తెలుస్తోంది. ఎన్నిక‌లు బహిష్క‌రిస్తే.. పార్టీ మ‌రింత బ‌ల‌హీన ప‌డుతుంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తంచేసిన‌ట్టు స‌మాచారం.

ఇలాంటి ప‌రిస్థితుల్లో సాగుతున్న టీడీపీ పొలిట్ బ్యూరో స‌మావేశం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇప్ప‌టికే పంచాయ‌తీ, మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌పై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్న‌ట్టుగా అశోక గ‌జ‌ప‌తి గైర్హాజ‌రి ఉదంతం చెబుతోంది. మ‌రి, చంద్ర‌బాబు నాయుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.