Begin typing your search above and press return to search.
మ్యాచ్ ఫిక్సింగ్ పై అశ్విన్ చురకలు
By: Tupaki Desk | 20 Feb 2018 7:25 AM GMTభారత్ ఆటగాడు రవి చంద్రన్ అశ్విన్ తన దూస్రాలతో ప్రత్యేర్ధులు మట్టికరిపించడంలో తనకు తనేసాటి. అంతేకాదు భారత క్రికెట్ గురించి, తన గురించి ప్రత్యర్ధులు చేసే వ్యాఖ్యలకు ఘాటుగా రిప్లయి ఇవ్వడంలో అశ్విన్ ఎప్పుడూ ముందుంటాడు.
గత ఏడాది మార్చి 30న ధర్మశాలలో ఇండియా- ఆస్త్రేలియాల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఆ టెస్ట్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. కోహ్లీ తప్పుకోవడాన్ని తప్పు బట్టిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాడ్జ్ విమర్శలు చేశాడు. ధర్మశాల మ్యాచ్ కు కోహ్లీ తప్పుకోవడానికి ఐపీఎల్ కారణమని దుయ్యబట్టాడు. బ్రాడ్ హాడ్జ్ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పాడు. అయితే, తాను చేసిన వ్యాఖ్యలు కోహ్లీని కించపర్చడానికి కాదని, అలా మాట్లాడినందుకు క్షమాపణలు చెబుతున్నానని అన్నాడు. ఈ క్షమాపణలపై అశ్విన్ చురకలంటించాడు. క్షమాపణ చెబుతూ హాడ్జ్ పేర్కొన్న లేఖపై ట్విట్టర్ ద్వారా అశ్విన్ స్పందిస్తూ... క్రికెట్ అభిమానులకు ఒక సూచన చేశాడు. ఇక నుంచి మార్చి 30న అంతర్జాతీయ క్షమాపణ దినోత్సవంగా గుర్తిద్దామని వెటకారంగా ట్వీటు చేశాడు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే భారత్ - ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ - ఆశిస్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అశ్విన్ 30 పరుగులు చేసి, 1వికెట్ తీశాడు.
తాజాగా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హెర్షల్ గిబ్స్ పై అశ్విన్ తన దూస్రాల్ని సంధించడంతో విలవిల్లాడిపోయాడు. 2000సంవత్సరంలో గిబ్స్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడు. దీంతో అతడిపై ఆరునెలల పాటు నిషేదాన్ని విధిస్తూ దక్షిణాప్రికా క్రికెట్ బోర్డ్ చర్యలు తీసుకుంది.
అయితే తన ఆట గురించి అశ్విన్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన గిబ్స్ ..అశ్విన్ అవుట్ ఫీల్డ్ లో పరిగెత్తలేడని అర్ధం వచ్చేలా ‘ఇకనైనా నువ్వు మరింత వేగంగా పరుగెత్తగలవని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై అశ్విన్ ఊరుకుంటాడా. ఎప్పటిలాగానే గిబ్స్ కు చురకలంటించేలా రిప్లయి ఇచ్చాడు. ‘ పరిగెత్తే విషయంలో నేను నీ అంత అదృష్టవంతుడిని కాలేను మిత్రమా అంటూ ట్విట్ చేశాడు. అంతేకాదు నాకు తిండి పెట్టే మ్యాచ్‌లను ఫిక్స్ చేయకూడదనే నైతిక విలువలు పాటించడంలో మాత్రం చాలా అదృష్టవంతుడిని’ అని ఘాటుగా జవాబిచ్చాడు. దీంతో షాక్ తిన్న గిబ్స్ నా ట్విట్ ను అశ్విన్ తప్పుగా అర్ధం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నట్లు మరో ట్వీట్ చేశాడు. తాను చేసింది జోక్ మాత్రమే అంటూ, మున్ముందు కలిసి డిన్నర్ చేద్దామంటూ పిలిచాడు.