Begin typing your search above and press return to search.
తాజ్‌మహల్ కు పన్ను పోటు.. వింతల్లో కెల్లా వింత గురూ!
By: Tupaki Desk | 20 Dec 2022 2:30 AM GMTప్రపంచ ప్రేమికుల స్వర్గధామం తాజ్ మహల్.. పేరుచెప్పగానే ఒళ్లు పులకిస్తుంది. అయితే.. ఈ తాజ్మహల్ ఇంటిపన్ను బకాయి ఉందని, దీనిని చెల్లించాలంటూ ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ).. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)కి నోటీసులు పంపింది. ఏఎంసీ.. పన్ను చెల్లించేందుకు ఏఎస్‌ఐకి 15 రోజులు గడువు ఇచ్చింది. ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ పన్ను అసెస్మెంట్ అధికారి నవంబరు 25న ఈ నోటీసులను జారీ చేశారు.
అయితే ఈ నోటీసులు ఏఎస్ఐకి ఇటీవలే అందాయి. తాజ్ మహల్తో పాటు యమునా నదికి ఆనుకొని ఉన్న స్మారక చిహ్నం ఎత్మాద్-ఉద్-దౌలాకు కూడా నోటీసులు జారీ చేశారు. అయితే బ్రిటిషు హయాం నుంచి ఇప్పటి వరకు ఇలా పన్నులు కట్టమని నోటీసులు పంపడం జరగలేదని, ఇదే మొదటిసారి అని ఏఎస్ఐ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏఎంసీ పంపించిన నోటీసుల ప్రకారం 2022 మార్చి 31 వరకు పెండింగ్లో ఉన్న భూమి పన్ను రూ. 88,784గా ఉంది.
దీంతో పాటు అదనంగా రూ. 47,943 వడ్డీ చెల్లించాల్సి ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి హౌస్ టాక్స్ రూ. 11,098గా ఉంది. శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ ద్వారా ఇంటి పన్ను కోసం సాయి కన్‌స్ట్రక్షన్ కంపెనీ చేసిన సర్వే ఆధారంగా ఈ నోటీసులు జారీ చేసినట్లు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, తాజ్‌గంజ్ జోనల్ ఇన్‌ఛార్జ్ సరితా సింగ్ తెలిపారు.
ఈ నోటీసుల గురించి ఏఎస్ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్కుమార్ సర్కార్ మాట్లాడుతూ.. తాజ్ మహల్తో సహా అన్ని స్మారక చిహ్నాల సంరక్షణ బాధ్యతలను మాత్రమే తాము చూస్తామని అన్నారు. పన్ను చెల్లింపు పరిధి తమకు సంబంధం లేదని వెల్లడించారు. కాగా, పన్ను దాదాపు రూ.లక్షకు దాటిపోవడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.