Begin typing your search above and press return to search.

ఏడాదిలోనే సగం సంపద కోల్పోయిన ఆసియా అత్యంత సంపన్నురాలు

By:  Tupaki Desk   |   29 July 2022 1:30 AM GMT
ఏడాదిలోనే సగం సంపద కోల్పోయిన ఆసియా అత్యంత సంపన్నురాలు
X
చైనాలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ఆసియా అత్యంత సంపన్నురాలి ఆదాయంపై తీవ్రమైన దెబ్బపడింది. ఒక్క ఏడాదిలోనే ఆమె సగం సంపద ఆవిరైటన్లు బిలియనీర్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. స్థిరాస్తి సంస్థ కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్ హాంకాంగ్ లిస్టెడ్ షేర్లు బుధవారం కుప్పకూలాయి. షేర్లు 15శాతం మేర పడిపోయాయి.

ఈ కంపెనీ కో చైర్మన్ అయినయాంగ్ హుయాన్ సంపద నిన్న ఒక్కరోజే 2 బిలియన్ డాలర్ల మేర కరిగిపోయింది. బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ కథనం ప్రకారం.. గత ఏడాది హుయాన్ నికర సంపద విలువ 23.7 బిలియన్ డాలర్లుగా ఉండగా.. తాజాగా 11.3 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఏడాది వ్యవధిలోనే హుయాన్ సంపద 52 శాతానికి ఆవిరైపోవడం గమనార్హం.

ఏడాది వ్యవధిలోనే హుయాన్ సంపదన 52శాతానికి పైగా ఆవిరైపోవడం గమనార్హం. యాంగ్ హుయాన్ 2005లో తన తండ్రి, కంట్రీ గార్డెన్ వ్యవస్థాపకుడు యాంగ్ గుఖియాంగ్ నుంచి షేర్లను వారసత్వంగా పొందాడు. దీంతో ఆమె సంపద భారీగా పెరిగింది. ఆ తర్వాత రెండేళ్లకు ఈ కంపెనీ హాంకాంగ్ లో ఐపీఓకు వెళ్లింది. దీంతో ఆమె ఆసియాలోనే అత్యంత ధనవంతురాలిగా అగ్రస్థానానికి ఎదిగారు. ఇప్పటికీ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉన్నప్పటికీ త్వరలోనే ఈమె ర్యాంకు మారే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఆసియాలో అత్యంత సంపన్నురాలి జాబితాలో కెమికల్ ఫైబర్స్ టైకూన్ ఫ్యాన్ హాంగ్ వెయి రెండో స్తానంలో ఉన్నారు. ఈమె సంపద విలువ 11.2 బిలియన్ డాలర్లు. ఈమె తర్వలోనే హుయాన్ ను దాటి నంబర్ 1 ర్యాంకుకు చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇక హుయాన్ సంపద ఆవిరి కావడానికి చైనాలో రియల్ ఎస్టేట్ కుప్పకూలడమే కారణం. స్థిరాస్థి రంగంలో అప్పుల కుప్పలు పెరగడంతో అడ్డగోలుగా రుణాలు సమీకరించకుండా ఉండేందుకు 2020లో డ్రాగన్ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీని నియంత్రణ సంస్థలు అమలు చేయడంతో రియల్ ఎస్టేట్ సంస్థల వద్ద నగదు ప్రవాహం తగ్గింది.

ఫలితంగా ఎవర్ గ్రాండె, సునక్ వంటి దిగ్గజ సంస్థలు దివాలా అంచునకు వెళ్లాయి. దీంతో ఈ ప్రాజెక్టులు నిర్మాణాలు నిలిపివేశాయి. ఈ సెగ మధ్యతరగతి వర్గాన్ని తాకి వారు ఇళ్ల కొనుగోలుకు చెల్లింపులు చేసినప్పటికీ నిర్మాణాలు పూర్తికాకపోవడంతో అక్కడి ప్రజలు రుణ చెల్లింపులను నిలిపివేశారు.