Begin typing your search above and press return to search.
'విమోచనం' వేదికగా... బీజేపీ హీట్ పెంచేస్తోంది
By: Tupaki Desk | 14 Sep 2019 5:12 PM GMTతెలంగాణలో ఇప్పుడు రాజకీయం రంజుగా మారింది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిపించేసుకుని ఎలాగోలా బయటపడ్డ టీఆర్ ఎస్... సార్వత్రికంలో తగిలిన దెబ్బలతో విలవిల్లాడుతోందనే చెప్పక తప్పదు. ఇలాంటి కీలక తరుణంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీఆర్ ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ... ఇప్పుడు సరికొత్త వ్యూహాలతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే సింగరేణి కాలరీస్ లోని టీఆర్ ఎస్ కు చెందిన గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)ను రెండుగా చీల్చేసిన బీజేపీ.. ఇప్పుడు తెలంగాణ విమోచన దినం వేదికగా తనదైన వ్యూహాత్మక రాజకీయాన్ని మరింతగా వేడెక్కించేందుకు రంగం సిద్ధం చేసింది. వరుసగా బీజేపీ అనుసరిస్తున్న వ్యూహంతో నిజంగానే టీఆర్ ఎస్ కు ఊపిరాడట్లేదన్న విశ్లేషణలు బాగానే వినిపిస్తున్నాయి.
సెప్టెంబర్ 17న తెలంగాణకు విమోచన కలిగిందని - ఆ సందర్భంగా ఆ రోజు తెలంగాణ విమోచన దినం పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీజేపీ.. ఏళ్ల తరబడి ఈ వేడుకలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ అడ్డగింతలు ఎదురవుతున్నా కూడా బీజేపీ వెనకడుగు వేయడం లేదు. ఈ క్రమంలో ఈ దఫా తెలంగాణ విమోచన దినం వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న బీజేపీ... ఇప్పుడు అదే డిమాండ్ తో శనివారం కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసింది. తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ తో కూడిన బీజేపీ ప్రతినిధి బృందం రాజ్ భవన్ కు వెళ్లి మరీ గవర్నర్ ను కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేలా కేసీఆర్ సర్కారుకు ఆదేశాలు ఇవ్వాలని కూడా వారు గవర్నర్ ను కోరారు.
ఇదేదో రోటీన్ వ్యవహారంలాగే కనిపిస్తున్నా... బీజేపీకి చెందిన తమిళిసై గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆమెతో తెలంగాణ బీజేపీ నేతలు ప్రత్యేకంగా భేటీ కావడం - తొలి భేటీలోనే కీలక అంశాన్ని ప్రస్తావించడం చూస్తుంటే... తెలంగాణ విమోచన దినం వేడుకలను వేదికగా చేసుకుని బీజేపీ భారీ ప్లాన్ నే రచించినట్లుగా తెలుస్తోంది. రజాకార్ల దాష్టీకాల నుంచి నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణను దేశంలో కలిపేసిందని, ఈ సందర్భాన్నే... తెలంగాణ విమోచన దినంగా పాటిస్తున్నామని బీజేపీ వాదిస్తోంది. అదే సమయంలో తెలంగాణ విమోచన దినం అంటేనే అంతెత్తున ఎగిరిపడుతున్న మజ్లిస్.. విమోచన దిన వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు ససేమిరా అంటోంది. ఇటు మిత్రపక్షం వద్దంటుంటే... అటు అంతకంతకూ బలపోతమవుతున్న రాజకీయ ప్రత్యర్థి బీజేపీ నిర్వహించాలని పట్టుబడుతుంటే... ఏం చేయాలో పాలుపోక టీఆర్ఎస్ నిజంగానే తల పట్టుకుంది.
ఈ తరహా పరిస్థితిపై పక్కాగానే వ్యూహాలను పకడ్బందీగా రచించుకున్న బీజేపీ... విమోచన దినం వేదికగానే టీఆర్ఎస్ ను డిఫెన్స్ లోకి నెట్టేసేందుకు మాస్టర్ ప్లాన్ రచించినట్టుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ ప్లాన్ ఎంతమేరకు వర్కవుట్ అవుతుందన్న విషయాన్ని పక్కనపెడితే... తెలంగాణ విమోచన దినం వేడుకల కోసం పట్టుబడుతున్న బీజేపీకి చెందిన నేతే ఇప్పుడు గవర్నర్ గా ఉన్న వేళ... ఆ విషయాన్ని ఎలా సైడ్ చేయాలన్న విషయం అర్థం కాక కేసీఆర్ కూడా అమోమయంలో పడిపోయినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణ విమోచన దినం వేదికగా బీజేపీ రచిస్తున్న వ్యూహంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయం బాగా వేడిక్కిపోయిందని చెప్పక తప్పదు.