Begin typing your search above and press return to search.

బ్రిటన్ ప్రధాని దగ్గరా అసహనం తప్పలేదా?

By:  Tupaki Desk   |   14 Nov 2015 6:23 AM GMT
బ్రిటన్ ప్రధాని దగ్గరా అసహనం తప్పలేదా?
X
గత కొద్ది వారాలుగా సాగుతున్న మత అసహనం వ్యవహారం మీద ప్రధాని మోడీ పెద్దగా స్పందించింది లేదు. ఆయన వద్దకు నేరుగా ఆ ఇష్యూను తీసుకెళ్లే దమ్ము.. ధైర్యం ఉన్న నాయకులు లేరు. ఇక.. ప్రశ్నించే మీడియాకు ప్రధానమంత్రి అవకాశం ఇవ్వరు కావట్టి.. మత అసహనం మీద ఆయన్ను ప్రశ్నించి.. సమాధానం రాబట్టే అవకాశం లేనట్లే. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ దగ్గర.. దేశంలో పెరుగుతున్న మత అసహనం.. అందుకు ఆయనేం అనుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకునే అవకాశం ఎలా? అన్న సందేహానికి తాజాగా సమాధానం లభించింది.

మూడు రోజుల బ్రిటన్ పర్యటన సందర్భంగా శుక్రవారం బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ నోట వెంట మత అసహనం మాట వచ్చేసింది. ప్రధాని మోడీతో సమావేశమైన సందర్భంగా ఆయన.. దేశంలో నానాటికీ పెరుగుతున్న మత అసహనం మాటను మోడీ ముందుకు తీసుకొచ్చారు. భారతదేశంలో వాక్ స్వాంతంత్ర్యం మీద 200 మంది రచయితలు తనకు రాసిన బహిరంగ లేఖలో వారు వ్యక్తం చేసిన ఆందోళనల్ని మోడీ దృష్టికి తాను తీసుకెళ్లినట్లు బ్రిటన్ ప్రధాని కామెరాన్ వెల్లడించారు.

మోడీ.. తాను కలిసి భోజనం చేశామని..ఈ సందర్భంగా మత అసహనపు మాటను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా దేశంలో రాజుకున్న మత అసహనం అంశం.. ప్రధాని మోడీకి దేశం దాటి వెళ్లిన తర్వాత కూడా ఆయన ముందుకు రావటం కాస్తంత ఇబ్బందికరమైన అంశంగా చెప్పక తప్పదు.