Begin typing your search above and press return to search.

చిన్నమ్మ జీతం గురించి చెప్పేదే లేద‌న్నారే

By:  Tupaki Desk   |   12 July 2017 5:19 AM GMT
చిన్నమ్మ జీతం గురించి చెప్పేదే లేద‌న్నారే
X
మోడీ స‌ర్కారులో కేంద్ర‌మంత్రులు ప‌లువురు ఉన్నా.. కొంద‌రికి ఉన్న ఇమేజే వేరు. సోష‌ల్ మీడియాను సాధ‌నంగా చేసుకొని ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌రైన కేంద్ర‌మంత్రుల్లో రైల్వే మంత్రి సురేశ్ ప్ర‌భుతో పాటు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఒక‌రు. ట్విట్ట‌ర్ ను వేదిక‌గా చేసుకొని.. త‌న దృష్టికి వ‌చ్చిన స‌మ‌స్య‌ల్ని వెనువెంట‌నే ప‌రిష్క‌రించే విష‌యంలో ఆమె స్పీడ్ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

కొన్ని సంద‌ర్భాల్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ కు వెళ్లి మ‌రీ.. ఆమె సాయం చేస్తుంటారు. అలాంటి సుష్మా భ‌ర్త కౌశ‌ల్ స్వ‌రాజ్ కూడా ట్విట్ట‌ర్‌ లో చురుగ్గా ఉంటారు. ఆయ‌న్ను ప‌లు ప్ర‌శ్న‌ల‌తో ఇబ్బంది పెట్టినా.. ప్ర‌శ్న‌కు త‌గ్గ‌ట్లుగా స‌మాధాన‌మిస్తూ నిత్యం యాక్టివ్ గా ఉంటారు. ఇలాంటి కౌశ‌ల్‌ కు తాజాగా ఒక ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది.

కేంద్ర‌మంత్రి సుష్మా స్వరాజ్ మీ జీతం ఎంత‌? అంటూ ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె భ‌ర్త కౌశ‌ల్ రియాక్ట్ అయ్యారు. నా వ‌య‌సు.. మేడం జీతం అడ‌గ‌కూడ‌దు. అది మంచి ప‌ద్ద‌తి కాదంటూ కాస్తంత కొంటెగా చెబుతూ.. అస‌లు విష‌యాన్ని దాటేశారు. ఇబ్బంది పెట్టే ప్ర‌శ్న‌ల్ని నేర్పుగా ప‌క్క‌దారి ప‌ట్టించ‌టం ఎలానో చిన్న‌మ్మ భ‌ర్త కౌశ‌ల్ ద‌గ్గ‌ర ప‌లువురు రాజ‌కీయ నేత‌లు పాఠాలు నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.