Begin typing your search above and press return to search.
అడిగినన్ని సీట్లు ఇచ్చారు....జగన్ నోరు విప్పాల్సిందే...?
By: Tupaki Desk | 9 Feb 2022 10:30 AM GMTఏపీకి తీరని అన్యాయం జరిగింది అని స్వయంగా ప్రధాని రాజ్యసభలో చెప్పిన తరువాత కూడా ఏపీలోని ఎంపీలు, ప్రభుత్వం స్పందించకపోతే చరిత్ర క్షమించదు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏపీకి అన్యాయం చేసిన వారే ఇది దారుణమైన విభజన అంటూంటే కనీసం దాని మీద కూడా మాట్లాడేందుకు ఏపీలోనివైసీపీ ఎంపీలకు ఉన్న అభ్యంతరాలు ఏంటి అని నిలదీశారు.
తలుపులు మూసి ఏపీని యూపీయే సర్కార్ పెద్దలు విభజించారు అని నరేంద్ర మోడీ తాజాగా నిండు సభలో చెప్పాక అసలు ఆనాడు పార్లమెంట్ లో ఏమి జరిగింది అని పూర్తి విషయాలు తెలుసుకునేందుకు అయినా వైసీపీ ఎంపీలు చర్చకు నోటీసు ఇవ్వాలని ఉండవల్లి అన్నారు. తనకు అధికారం ఇస్తే ప్రత్యేక హోదా సహా అన్నీ తీసుకువస్తానని చెప్పిన జగన్ ఇపుడు రెండున్నరేళ్ళుగా ఏమీ చేయలేకపోయారు అని ఆయన నిందించారు.
మరో వైపు పోలవరం ప్రాజెక్ట్ ని కేంద్రం కట్టాల్సి ఉండగా ఏపీ సర్కార్ తన చేతుల్లోకి తీసుకోవడమేంటి అని కూడా నిలదీశారు. ఏపీ విభజనకు సంబంధించి రూపొందించిన చట్టంలోని అన్ని అంశాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తుంగలోకి తొక్కుతున్నా మాట్లాడడానికి భయం ఎందుకని జగన్ని ప్రశ్నించారు.
ఇక ఏపీని అన్యాయంగా విభజించారని, తాను ఆరేళ్ల క్రితమే విభజన కధ పేరిట పుస్తకం రాశానని, అందులో తాను రాసిన మాటలనే ప్రధాని మోడీ రాజ్యసభలో కూడా చెప్పారని, ఏ రాజ్యాంగ నిబంధలను పట్టించుకోకుండా బలవంతంగా విభజన చేశారని, ఈ విషయం అందరూ ఒప్పుకుంటున్నా అన్యాయమైపోతున్న ఏపీ నుంచి కూడా ఒక్క ఎంపీ కూడా ప్రశ్నించకపొవడం బాధాకరమని ఉండవల్లి అన్నారు.
దీని మీద పార్లమెంట్ లో నోటీస్ ఇచ్చి చర్చ జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికార వైసీపీ తీసుకోవాలని ఆయన కోరారు. జగన్ కోరిన దాని కంటే ఎక్కువ సీట్లు ఇచ్చి ఆయన్ని ఏపీకి చక్రవర్తిగా జనాలు చేశారని ఉండవల్లి అన్నారు. మరి ఆ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అందుకున్న జగన్ ఏపీకి తీరని అన్యాయం జరుగుతూంటే చూస్తూ ఊరుకోవడం భావ్యం కాదని అన్నారు.
మోడీ ఏమైనా అనుకుంటారని భయం ఎందుకని ఆయన అన్నారు. మోడీయే కాంగ్రెస్ ఏపీకి అన్యాయం చేసింది అని చెబుతున్న వేళ అడ్డగోలు విభజన మీద పార్లమెంట్ లో చర్చ జరపాలని వైసీపీ ఎంపీలు కోరాలని డిమాండ్ చేసారు. ఏపీకి అన్యాయం జరిగింది అని గతంలో అమిత్ షా కూడా పార్లమెంట్ లో అన్న దాన్నికూడా ఉండవల్లి గుర్తు చేశారు.
ఏపీ నుంచి విభజన వద్దు అని తీర్మానం వచ్చినా కూడా పక్కన పెట్టి విభజించారని ఉండవల్లి చెప్పుకొచ్చారు. గతంలో బీజేపీ మూడు రాష్ట్రాలనువిభజించినా కూడా ఆయా రాష్ట్రాలు అంగీకరించి తీర్మానాన్ని చేశాయని అన్నారు. పైగా అక్కడ విభజన జరిగిన ప్రాంతాలు ఎక్కడా రాజధానిని కోల్పోలేదని ఆయన పేర్కొన్నారు.
అదే ఉమ్మడి ఏపీని విభజిస్తూ డెబ్బై శాతం ఆదాయం వచ్చే హైదరాబాద్ రాజధానిని తెలంగాణాకు ఇచ్చేశారని, ఇంతకంటే దారుణం ఉంటుందా అని ఆయన అన్నారు. మరో వైపు చూస్తే షెడ్యూల్ 9, 10 లో పేర్కొన్న ప్రకారం లక్షా 42 వేల 610 కోట్ల విలువ చేసే 150 ప్రభుత్వ సంస్థల ఆస్థులను ఈ రోజుకీ పంపిణీ చేయలేదని, ఈ విధంగా ఏపీకి తీరని ద్రోహాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ చేసింది అని అన్నారు.
జనాభా ప్రకారం ఈ ఆసుల పంపిణీ జరగాలని, అయితే దీని మీద కేంద్రం తమ చేతుల్లో ఏమీ లేదని అనడం కంటే బాధ్యతారాహిత్యం మరోటి లేదని అన్నారు. ఇక విభజన పాపంలో కాంగ్రెస్ తో పాటు బీజేపీకి కూడా పూర్తి వాటా ఉందని ఉండవల్లి అన్నారు. అయినా సరే ఏపీకి జరిగిన అన్యాయన్ని నిగ్గదీసి అడిగే వారు లేకపోవడమే బాధాకరమని అన్నారు.
ఏపీని కేంద్ర పెద్దలు లైట్ తీసుకుంటున్నారని, ఏపీలోని టీడీపీ వైసీపీ, జనసేన కూడా ఆ పార్టీకి మద్దతుగానే ఉన్నాయని ఉండవల్లి కామెంట్స్ చేశారు. ఇదే తీరున కేంద్రం చేసిన అన్యాయన్ని తలవంచి ఊరుకుంటే రేపు ఇంతకంటే ఘోరాలు మరిన్ని చేసినా ఏపీ జనాలు కిమ్మనే పరిస్థితి ఉండదని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఈ అడ్డగోలు విభజన మీద తాను సుప్రీం కోర్టులో కేసు వేస్తే ఏపీ తరఫున ఇప్పటిదాకా అఫిడవిట్ దాఖలు చేయలేదని జగన్ సర్కార్ ని విమర్శించారు. ఇది మంచి విధానం కాదని, ఏపీని ఇలా గాలికి పాలకులు వదిలేస్తే ప్రజలకు ఇక భరోసా ఎక్కడి నుంచి వస్తుందని ఆయన నిర్వేదం చెందారు. మొత్తానికి జగన్ ఏపీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తాడని జనాలు ఓటేస్తే ఆయన ఎందుకో కేంద్రానికి భయపడుతున్నారని కూడా ఉండవల్లి సెటైర్లు వేయడం విశేషం.