Begin typing your search above and press return to search.
ఎన్ కౌంటర్ ను తప్పు పట్టిన ఓవైసీ
By: Tupaki Desk | 7 Dec 2019 6:45 AM GMTదిశ హంతకుల ఎన్ కౌంటర్ పై యావత్ భారతం సంబరాలు చేసుకుంటుంటే కొంతమంది రాజకీయ నేతలు మాత్రం ఈ ఎన్ కౌంటర్లను వ్యతిరేకిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే బీజేపీ ఎంపీ మేనకా గాంధీ, జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్ కౌంటర్ ను తప్పు పట్టారు. ఇప్పుడు అదే కోవలో మన ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా దిశ హంతకుల ఎన్ కౌంటర్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు.
తాను ఎన్ కౌంటర్లకు వ్యతిరేకమని.. చట్టబద్ధంగా, న్యాయస్థానాల ద్వారా కేసు విచారణ జరగాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. తెలంగాణలో జరిగిన నలుగురి ఎన్ కౌంటర్ కు కారణాలు, ఎందుకు చేయాల్సి వచ్చిందో తేల్చాలని.. పోలీసుల పై మెజిస్ట్రీరియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఈ నలుగురి ఎన్ కౌంటర్ పై విచారణ పూర్తయిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ స్పష్టం చేశారు.