Begin typing your search above and press return to search.

భారత్ లో బంగ్లా ప్రధాని... అఖండ భారత్ నినాదం...?

By:  Tupaki Desk   |   7 Sep 2022 5:30 PM GMT
భారత్ లో బంగ్లా ప్రధాని... అఖండ భారత్ నినాదం...?
X
అఖండ భారతం అన్నది రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ నినాదం. ఈ దేశం ఎప్పటికైనా ఒక్కటిగా ఉండాలని ఆరెస్సెస్ తలపోస్తూ ఉంటుంది. అయితే ఇది ఒక కోరికగానే ఉంటోంది. దానికి కారణం కాలం గడచిపోయింది. ఒకప్పుడు భారత్ తో పాటే ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, టిబెట్, నేపాల్, ఆఫ్ఘనిస్థాన్ వంటివి ఈ రోజుకు వేరు అయిపోయాయి. అవన్నీ ఏ దేశానికి ఆ దేశాలుగా మనగలుగుతున్నాయి.

ఈ నేపధ్యంలో అఖండ భారత్ అన్నది జరుగుతుందా అంటే అది మిలియన్ డాలర్ ప్రశ్నగానే చూడాలి. ఇక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా అని కాంగ్రెస్ అంటోంది. దానికి కౌంటర్ గా అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఘాటైన కామెంట్స్ చేశారు.

ఈ దేశమంతా ఐక్యంగానే ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అలాగే, సిల్చార్ నుంచి సౌరాష్ట్రా దాకా కూడా ఒకటే భారతం ఉంది అని ఆయన చెప్పారు. ఆయన ఇక్కడి దాకా చెప్పిన దాంట్లో తప్పు అయితే లేదు. కానీ రాహుల్ భారత్ జోడో యాత్ర నిర్వహించాలంటే పాకిస్థాన్ కి వెళ్ళి చేపట్టాలని కోరడమే వివాదంగా ఉంది. రాహుల్ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశాన్ని విభజించారని దానికి కనుక రాహుల్ బాధపడితే అటు పాక్ ని ఇటు బంగ్లాదేశ్ ని కలిపి అఖండ భారతాన్ని సృష్టించవచ్చు అని సంచలన కామెంట్స్ చేశారు.

ఇపుడు సందర్భం వేరేగా ఉంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ లో నాలుగు రోజుల పర్యటన చేస్తున్నారు. ఆమె ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. కీలకమైన ఏడు  ఒప్పందాల మీద సంతకాలు ఇరు దేశాలు సంతకాలు చేసుకున్నాయి. ఈ నేపధ్యంలో అసోం సీఎ చేసిన ఈ వ్యాఖ్యలు బంగ్లా ప్రధాని షేక్ హసీనా చెవిలో పడకుండా ఉంటాయా. ఆమె దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో అన్న ఆలోచన ఏదీ లేకుండా ఆవేశంగా అసోం సీఎం చేసిన కామెంట్స్ మీద ఇపుడు చర్చగా ఉంది.

పైగా అఖండ భారత్ అంటే అంతా భారత్ కింద పనిచేయాల్సి ఉంటుంది. స్వంతంత్ర రాజ్యాలుగా ఏర్పడిన తరువాత ఎవరి దారి వారిది అయిన తరువాత ఇన్ని దశాబ్దాల తరువాత అఖండ భారత్ అంటే ఏ దేశామూ ఒప్పుకోదు. అయినా అతిధిగా బంగ్లాదేశ్ ప్రధాని భారత్ లో ఉన్నారు అన్న ఆలోచన లేకుండా అసోం సీఎం చేసిన ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన రాహుల్ గాంధీనే విమర్శించాలనుకోవచ్చు. కానీ సమయం సందర్భం రెండూ కూడా వేరుగా ఉన్నాయి. అఖండ భారత్ నినాదానికి ఇది సరైన టైం కానే కాదు. దాంతో అసోం సీఎం వివాదమే చేశారు అని అంటున్నారు. రాహుల్ మీద కామెంట్స్ చేసినవి బూమరాంగ్ అయ్యాయని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.