Begin typing your search above and press return to search.
మరీ ఇంత దారుణమా.. వైరల్ వీడియో
By: Tupaki Desk | 30 Jan 2019 12:44 PM GMTచేతిలో అధికారం ఉంటే ఎంతకైనా తెగించొచ్చు. ఏదైనా చేసేయొచ్చు. అడిగేవాడు ఎవడు? ఇలా తయారైంది ప్రస్తుతం దేశంలో రాజకీయ వ్యవస్థ. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా అస్సాంలో మరో ఘటన నిలిచింది. స్వయంగా ముఖ్యమంత్రి ర్యాలీలో ఓ చిన్నారి కోటు తొలిగించారు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం అస్సాంలో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా భారీగా ఉద్యమాలు జరుగుతున్నాయి. నల్ల బ్యాడ్జీలు - రిబ్బన్లతో ఎక్కడికక్కడ పౌరులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ నిరసన సెగ స్వయంగా ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ కు కూడా తగిలింది. దీంతో బిస్వాంత్ జిల్లాలో సీఎం నిర్వహించిన ర్యాలీకి భారీగా భద్రత ఏర్పాటుచేశారు.
భద్రత ఏర్పాట్లలో భాగంగా నల్ల బ్యాడ్జీలు - జెండాలు లేకుండా చూశారు అధికారులు. చివరికి ఓ చిన్నారి వేసుకున్న నల్ల కోటును కూడా తీసేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలే చలికాలం - అస్సాంలో ఏ రేంజ్ లో చలి ఉంటుందో తెలిసిందే. అయినప్పటికీ ఏమాత్రం కనికరం లేకుండా చిన్నారి కోటును పీకేశారు పోలీసులు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ ఘటనపై సీఎం దర్యాప్తునకు ఆదేశించారు.