Begin typing your search above and press return to search.

హైడ్రాక్సీక్లోరోకైన్ వేసుకున్న డాక్టర్ మృతి - కారణం అదేనా?

By:  Tupaki Desk   |   30 March 2020 10:30 PM GMT
హైడ్రాక్సీక్లోరోకైన్ వేసుకున్న డాక్టర్ మృతి - కారణం అదేనా?
X
కరోనా సోకిన వారికి చికిత్స అందించే డాక్టర్లు - నర్సులు - ఇతర వైద్య సిబ్బందిది భయానక పరిస్థితి. చికిత్స చేస్తున్న చాలామందికి కరోనా సోకుతోంది. ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ నిత్యం కరోనా రోగులతోనే ఉండటం వల్ల కొంతమంది డాక్టర్లు - నర్సులకు ఈ మహమ్మారి అంటుకుంటోంది. ఇది అంటుకోకుండా ఉండేందుకు కొంతమంది వైద్యులు హైడ్రాక్సీక్లోరోకైన్ ఉపయోగిస్తున్నారట. దీనిని మలేరియాను నిరోధించేందుకు ఉపయోగిస్తారు. ఈ మెడిసిన్ కరోనా ప్రభావం తగ్గిస్తుందనే వాదనలు ఉన్నాయి.

అసోంలో ఓ డాక్టర్ ఇలాగే హైడ్రాక్సీక్లోరోకైన్ దీనిని తీసుకొని మృత్యువాత పడ్డారు. ఉత్పలజిత్ బర్మన్ అనే డాక్టర్ దీనిని ఉపయోగించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కరోనా దరిచేరకూడదని ఈ మలేరియా మెడిసిన్ వేసుకున్నాడు. అనంతరం కొద్ది రోజుల క్రితం గుండె సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత చనిపోయాడు.

ఐతే అతను చనిపోవడానికి ఈ మెడిసిన్ ఉపయోగించడమే కారణమా లేదా మరేదైనా ఉందా అని తేలాల్సి ఉంది. 44 సంవత్సరాల వయస్సు ఉన్న ఈ డాక్టర్ ఈ మాత్రను రెండు డోసులు వేసుకున్నాడని స్నేహితులు చెబుతున్నారు. ఆయన మృతిపై దర్యాఫ్తు చేస్తున్నారు.