Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలో ఇద్దరు పిల్లలున్నోళ్లకే సర్కారీ కొలువులు

By:  Tupaki Desk   |   22 Oct 2019 8:41 AM GMT
ఆ రాష్ట్రంలో ఇద్దరు పిల్లలున్నోళ్లకే  సర్కారీ కొలువులు
X
ఈశాన్య రాష్ట్రాల్లో కీలకమైన అసోం రాష్ట్ర సర్కారు అనూహ్య నిర్ణయాన్ని వెల్లడించింది. దేశంలోని మరే రాష్ట్రంలో లేని రీతిలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదని నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగానికి ఉండాల్సిన అర్హతలతో పాటు.. ఈ కొత్త అర్హతను యాడ్ చేశారు.

దీంతో.. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా తేల్చేసింది. అయితే.. ఈ నిబంధనలు ఇప్పటికిప్పుడు అమలు కాదని.. 2021 జనవరి ఒకటో తేదీ నుంచి అమలవుతాయని పేర్కొన్నారు. అంతే కాదు గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని నిరుపేదలకు మూడు బిగాల భూమి (ఒక బిగా భూమి అంటే ఎకరంలో 0.400గా చెబుతారు) ఇవ్వాలని.. సొంతింటి కోసం కూడా కొంత భూమిని ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

దీనికి సంబంధించిన నిర్ణయాన్ని అసోం సీఎం కార్యాలయం పేర్కొంది. ఇలా ప్రభుత్వం ఇచ్చే భూమిని పదిహేనేళ్ల పాటు మళ్లీ ఎవరికి అమ్మే వీలు ఉండదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాష్ట్రంలో బస్సు ఛార్జీల్ని ఒకేసారి పాతికశాతం పెంచాలని నిర్ణయించారు. ఉద్యోగాల్లో ఇద్దరు పిల్లలకు మించి ఉన్నోళ్లను సర్కారీ కొలువులకు అర్హులు కారన్న తీర్మానాన్ని 2017లొనే తీసుకున్నారు. కాకుంటే.. ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న దానిపై క్లారిటీ ఇచ్చారని చెప్పక తప్పదు.