Begin typing your search above and press return to search.
కొత్త నిర్ణయంః తలాఖ్ మహిళలకు పెన్షన్!
By: Tupaki Desk | 5 May 2017 4:46 PM GMTఇటీవలి కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ట్రిపుల్ తలాఖ్ విషయంలో బీజేపీ సారథ్యంలోని అస్సాం ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. తలాఖ్ బాధిత మహిళలకు పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలని అస్సాం సర్కారు నిర్ణయించింది. తలాఖ్ విధానంలో విడాకులు పొందిన మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడం కోసం వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణనిస్తామని అస్సాం ఆరోగ్య, విద్యాశాఖ మంత్రి హిమాంత విశ్వ శర్మ చెప్పారు. తద్వారా వారికి మెరుగైన జీవనం అందించేందుకు కృషిచేయనున్నట్లు వివరించారు.
విడాకులు పొందిన ఇతర మహిళలతో పోల్చినప్పుడు ముస్లిం మహిళలకు భర్తలనుంచి ఎలాంటి భరణం అందదని, ఈ నేపథ్యంలో వారిని ఆదుకోవడానికి ప్రత్యేకంగా పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించామని శర్మ అన్నారు. ఇలా ఆర్థికపరమైన భరోసాతో పాటుగా పలు కార్యక్రమాలు, శిక్షణ అంశాలు చేపట్టడం ద్వారా బాధిత మహిళలకు మేలు చేయనున్నట్లు వివరించారు. ముస్లిం మహిళలకు శిక్షణ సమయంలో ప్రత్యేకంగా పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించామని మంత్రి చెప్పారు.
ఇదిలాఉండగా...ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ త్రిపుల్ తలాఖ్ విషయంలో ఘాటు కామెంట్లు చేశారు. ముస్లిం మహిళలను గౌరవించని ట్రిపుల్ తలాఖ్ తుచ్ఛమైనదని మండిపడ్డారు. ఈ విషయంలో ముస్లిం మహిళల మనోభావాలను ముస్లిం పర్సనల్ లా బోర్డు పట్టించుకోవడం లేదని తస్లీమా నస్రీన్ మండిపడ్డారు.అందుకే పర్సనల్ లా బోర్డును నిషేధించాలని ఆమె సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/