Begin typing your search above and press return to search.
అఫ్తాబ్ పూనమ్ వాలా లాంటి చెత్తోళ్లు కాదు బిటుపన్ తములి లాంటోళ్లు ఉన్నారు
By: Tupaki Desk | 20 Nov 2022 9:30 AM GMTదేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన శ్రద్ధా దారుణ హత్య ఉదంతం గురించి విన్న వారంతా ప్రేమ అంటేనే సందేహంగా ముఖం పెట్టేసే పరిస్థితి. సహ జీవనం ఏ మాత్రం సేఫ్ కాదన్న భావనతో పాటు.. అఫ్తాబ్ లాంటి మేక వన్నె పులుల మీద కొత్త ఏవగింపు మొదలైంది. ప్రేమ.. రిలేషన్ షిప్ లాంటి వాటిపై సందేహాలకు తీసుకొచ్చేలా చేసిందని చెప్పాలి. ఇలాంటి నెగిటివ్ న్యూస్ మనసును ఎంత ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వేళలో.. అందుకు పూర్తి విరుద్ధంగా.. ప్రేమ అంటే ఇది కదా? ఇలాంటోళ్లు కూడా ఉన్నారన్న భావనతో పాటు.. చెడు మాత్రమే సినిమా స్కోప్ లో కనిపిస్తున్న వేళ.. వెలుగు రేఖలా మంచి కూడా ఉందన్న విషయాన్ని 'బిటుపన్ తములి ' లాంటి ప్రేమికులు స్పష్టం చేస్తుంటారు.
ఎవరీ బిటుపన్ తములి ? ఎందుకంతగా పొగిడేస్తున్నారు? అని అనుకోవచ్చు. కానీ.. విషయం తెలిస్తే మాత్రం మీరు కూడా అతడ్ని పదే పదే తలుచుకోవటం ఖాయం. ఇతగాడి గురించి తెలిసినప్పుడు.. బంగారమన్న భావన కలుగక మానదు. రీల్ సీన్ కు ఏ మాత్రం తీసిపోని ఈ రియల్ సీన్.. సుఖాంతం కాదు విషాద ఉదంతం. అయినప్పటికీ.. అతగాడి ప్రేమ గురించి తెలిసిన వారంతా.. అతడ్ని విపరీతంగా అభిమానిస్తున్న పరిస్థితి.
అసోంలోని మోరిగావ్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల బిటుపన్ తములి.. అక్కడికి దగ్గర్లోని కౌసువ గ్రామానికి చెందిన 24 ఏళ్ల ప్రాథనా బోరాలు ప్రేమికులు. మంచి టైం చూసుకొని ఇళ్లల్లో వారికి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే.. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైంది ప్రాథనా బోరా. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పటికి ఆమె ప్రాణాలు నిలవలేదు. తాజాగా ఆసుపత్రిలో మరణించింది.
తన ప్రియురాలి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేకపోయాడు బిటుపన్ తములి. తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ.. ప్రాథనా బోరా ఇంటికి వచ్చాడు. తామిద్దరం పెళ్లి చేసుకోవాలని.. కలిసి జీవిద్దామని బలంగా భావించినా.. విధి అందుకు భిన్నంగా తమ రాత రాయటంతో.. దాన్ని మార్చాలనుకున్నాడు. ప్రాథనా బోరా కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ఆమెకు తాళి కట్టాడు. అంతేకాదు.. తన పవిత్ర ప్రేమకు చిహ్నంగా తాను జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకోనని శపథం చేశాడు. బిటుపన్ గురించి తెలసిన వారంతా అతడి ప్రేమను ప్రశంసిస్తున్నారు. అతడి లోటును ఎవరూ తీర్చలేనప్పటికీ.. మంచి మనసు ఉన్నోళ్లు మన చుట్టూ ఉన్నారన్న భావన కలుగక మానదు.