Begin typing your search above and press return to search.

‘అసాంజె’ను అప్పగించలేం.. అమెరికాకు బ్రిటన్​ స్పష్టీకరణ..!

By:  Tupaki Desk   |   5 Jan 2021 1:30 AM GMT
‘అసాంజె’ను అప్పగించలేం.. అమెరికాకు బ్రిటన్​ స్పష్టీకరణ..!
X
అసాంజె ఈ పేరు చెబితే ఒకప్పుడు అగ్రదేశాల ఉన్నతాధికారులు, రాజకీయాలకు వెన్నులో వణుకుపుట్టేది. అసాంజే నడిపే ‘వికిలీక్స్​’ పేరు చెబితే కొందరు నేతలకు దడ పుట్టేది. వికిలీక్స్​ సంచలనాత్మక కథనాలతో చరిత్ర సృష్టించింది. నిరంతరం ఏదో ఒక సంచలన వార్తలు రాస్తూ.. వాటిని ఆధారాలతో సహా వికిలీక్స్​ ప్రచురించేది. అయితే ప్రస్తుతం అసాంజె బ్రిటన్​లో జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

అయితే అతడు అమెరికా రక్షణ, గూఢచర్యానికి సంబంధించిన అంతర్గత సమాచారాన్ని ప్రచురించాడన్న కేసులో అసాంజె అరెస్టయ్యారు.

అయితే అసాంజె ప్రస్తుతం బ్రిటన్​ జైల్లో ఉన్నారు. అతడిని తమకు అప్పగించాలంటూ చాలా కాలంగా అమెరికా కోరుతున్నది. ఈ కేసు సోమవారం బ్రిటన్​ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి వెనెస్సా బరైట్సర్ సోమవారం తీర్పు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసాంజె ప్రస్తుతం డిప్రెషన్​తో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అంతేకాక అమెరికాకు అప్పగిస్తే .. అసాంజే డిప్రెషన్​తో ఆత్మహత్య చేసుకొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

‘అసాంజె చాలా ఏళ్లపాటు లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో ఆశ్రయం పొందాడు. ఆ సమయంలో అతడు డిప్రెషన్​తో బాధపడ్డాడు. ఇప్పటికిప్పుడు అసాంజెను అమెరికాకు అప్పగించడం కుదరదు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

2010​-11 సంవత్సరంలో అసాంజె నేతృత్వంలోని వికిలీక్స్​ పత్రిక అమెరికా రక్షణశాఖకు చెందిన రహస్య పత్రాలను లీక్​ చేసింది. ఇరాక్​, ఆఫ్ఘనిస్థాన్​ దేశాల్లో అమెరికా అనేక యుద్ధనేరాలకు పాల్పడిందని వికీలీక్స్​ ఆధారాలతో సహా బయటపెట్టింది.

ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే అసాంజె చట్టవిరుద్ధంగా వ్యవహరించాడని.. అతడు దేశద్రోహానికి పాల్పడ్డాడని అమెరికా ఆరోపిస్తున్నది. అప్పటినుంచి అతడు బ్రిటన్​లోనే ఉన్నారు.