Begin typing your search above and press return to search.

ఎంపీ పై హత్యాయత్నం ?

By:  Tupaki Desk   |   27 Dec 2021 7:34 AM GMT
ఎంపీ పై హత్యాయత్నం ?
X
అవుననే చెబుతున్నారు ఆ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణ రాజు. ఈ విషయాన్ని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు కాబట్టి నమ్మాల్సిందే. కాకపోతే తనపై హత్యాయత్నం జరుగుతుందన్నది కేవలం ఆయన అనుమానం మాత్రమే అని ఇంటర్వ్యూ చూసిన తర్వాత అర్ధమవుతోంది. ఎందుకంటే జైల్లో ఉన్నపుడు తనపై దాడి జరిగిందని సదరు ఎంపీ ఎక్కడా చెప్పలేదు. మరి హత్యాయత్నం అనుమానానికి దారితీసిన కారణాలు ఏమిటి ? ఏమిటంటే తాను జైలుకు వెళ్ళగానే కరెంటు పోవటమేనట.

మెజిస్ట్రేట్ కోర్టు నుంచి తనను జైలుకు తీసుకెళ్ళగానే కరెంటు పోయిందట. మామూలుగా అయితే ఆ జైల్లో కరెంటు పోదు, పోయినా వెంటనే జనరేటర్ పనిచేస్తుందట. కానీ ఆరోజు మాత్రం కరెంటు పోవటమే కాకుండా జనరేటర్ కూడా పనిచేయలేదట. సీఐడీ అధికారులు రాజును అరెస్టు చేసిన తర్వాత జైల్లో జరిగిన పరిణామాలను ఒక ఇంటర్వ్యూలో వివరించారు. అయితే అందులో కొన్ని అనుమానలున్నాయి.

తాను జైల్లో ఉండగా ఒక ఖైదీ వచ్చి తనకు మంచినీళ్ళు ఇచ్చారట. ఆ తర్వాత అదే ఖైదీ ఫోన్ చేసి తన ప్రాణాలకు హానుందని హెచ్చరించి జాగ్రత్తగా ఉండమని చెప్పారట. నిజానికి రాజును అరెస్టు చేసిన తర్వాత తన దగ్గరున్న మొబలై ఫోనును పోలీసులు తీసేసుకున్నట్లే అప్పట్లో ఆయనే చెప్పారు. అంటే అప్పట్లో ఆయన చెప్పినదాని ప్రకారం రాజు దగ్గర ఫోనే లేదు. అలాంటిది జైల్లో ఉన్నపుడు తనతో మరో ఖైదీ ఫోనులో ఎలా మాట్లాడారు ? అలాగే రాజుగారి ఫోన్ నెంబర్ ఒక మామూలు ఖైదీకి ఎలా దొరికింది ?

పైగా ఆ ఖైదీ ఎవరయ్యా అంటే బెంగుళూరులో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనిచేసేవాడట. జగన్ ఇంట్లో పనిచేసే వ్యక్తి చెక్ బౌన్స్ కేసులో విజయవాడ జైల్లో ఉండటం ఏమిటో అర్థం కావడం లేదు. ఒక పనివాడేమిటి చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కోవటం ఏమిటో అర్థం కావటం లేదు. జైల్లో ఉండగా కరెంటు పోవటం మినహా ఇతరత్రా అనుమానాస్పద ఘటనలు ఏమీ జరగలేదని మళ్ళీ రాజే చెబుతున్నారు. దాన్నే తనపై హత్యాయత్నంగా ఎలా అనుమానించారో చెప్పలేదు. మొత్తానికి ఎప్పుడో జరిగిన ఘటనను సదరు ఎంపీ+మీడియా ఇంకా లైవ్ లో ఉంచాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది.