Begin typing your search above and press return to search.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం.. కారుపై బాంబు దాడి
By: Tupaki Desk | 15 Sep 2022 12:07 PM GMTఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ పై మరోసారి హత్యాయత్నం జరిగినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ఆయన ప్రయాణిస్తున్న కారుపై బాంబు దాడి జరిగినట్లు మీడియా వెల్లడించింది. అయితే ఈ ప్రమాదం నుంచి పుతిన్ క్షేమంగా బయటపడినట్లు తెలిపాయి.
మీడియా వర్గాల సమాచారం ప్రకారం..
పుతిన్ తన నివాసానికి తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న 'లిమోసిన్ కారు' ముందువైపు ఎడమ చక్రం భారీ శబ్ధంతో పేలింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది కారు నుంచి పొగలు వస్తున్నప్పటికీ అధ్యక్షుడి వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారని తెలిసింది. ఈ ఘటనలో పుతిన్ కు ఎలాంటి హానీ జరగలేదని.. ఆ తర్వాత మరో బ్యాక్ అప్ కాన్వాయ్ లో పుతిన్ ను అధ్యక్ష నివాసానికి తరలించారని సమాచారం.
బాంబు దాడి జరిగిన సమయంలో పుతిన్ కాన్వాయ్ లోని తొలి ఎస్కార్ట్ కారుకు అంబులెన్స్ అడ్డుగా వచ్చిందని దెలిసింది. రెండో ఎస్కార్ట్ కారు ఆగకుండా వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో ఇదంతా పక్కా ప్లానింగ్ తోనే చేసినట్టుగా అర్థమవుతోంది. బాంబు దాడి జరిగిన తర్వాత పెద్ద ఎత్తున అరెస్ట్ లు కూడా జరిగినట్లు సమాచారం.
ఇక అధ్యక్షుడి పర్యటనలో భద్రతా లోపాలు.. బాంబు దాడి జరగడంతో పుతిన్ సెక్యూరిటీ సర్వీస్ కు చెందిన పలువురు అధికారులను అరెస్ట్ చేసినట్టు మీడియా తెలిపింది. అధ్యక్షుడి బాడీగార్డ్ సర్వీస్ హెడ్ సహా పలువురు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసి కస్టడీలోకి తీసుకున్నట్టు పేర్కొంటున్నారు.
ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి రష్యాలో కొన్ని వర్గాలు పుతిన్ కు వ్యతిరేక ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనపై దాడికి యత్నించి ఉంటారని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. కొద్ది నెలల క్రితం కూడా పుతిన్ పై హత్యాయత్నం జరిగినట్లు ఉక్రెయిన్ తెలిపింది. కాకసస్ పర్యటనలో పుతిన్ పై పలువురు దాడి చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. దీన్ని రహస్యంగా ఉంచారని తెలిపింది. ఇప్పుడు మరోసారి రష్యా అధ్యక్షుడిపై దాడి కలకలం రేపుతోంది.
ఇక రెండురోజుల క్రితమే ఉక్రెయిన్ అధ్యక్షుడిి కారుపై కూడా దాడి జరిగింది. ఆ తర్వాతనే రష్యా అధ్యక్షుడిపై బాంబు దాడి చేయడంతో ఇది సానుభూతి కోసమా? లేక ప్రణాళికతో చేశారా? అని అందరూ అనుమానిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.