Begin typing your search above and press return to search.
5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందడి
By: Tupaki Desk | 4 March 2016 10:49 AM GMTఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైపోయింది. తమిళనాడు - పశ్చిమ బెంగాల్ - పుదుచ్చేరి - కేరళ - అసోం రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఆ ఐదు రాష్ట్రాలలోనూ ఎన్నికల కోడ్ అమలులోనికి వచ్చింది. ఐదు రాష్ట్రాలకు కలిపి మొత్తం 824 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో తమిళనాడు అసెంబ్లీకి 234 - పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 294 - అసోం 126 - పుదుచ్చేరి 30 - కేరళ 140 స్థానాలు ఉన్నాయి. ఐదు రాష్ట్రాలలోనూ కలిపి మొత్తం 17 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
కాగా పోలింగ్ తేదీకి ఐదు రోజుల ముందే ఓటర్లకు ఓటరు స్లిప్పులను ఆన్ లైన్ లో అందజేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నసీం జియాదీ తెలిపారు. ఐదు రాష్ట్రాలలోనూ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో మునుపెన్నడూ లేనట్లుగా అయిదు రోజుల ముందే ఓటర్లకు స్లిప్లులు అందజేయనుండడం విశేషం.
* పుదుచ్చేరి: మొత్తం 30 స్థానాలకు మొదటి దశలో మే 16న ఎలక్షన్. ఏప్రిల్ 22న నోటిఫికేషన్
* తమిళనాడు: మొదటి ఫేజ్ లోనే మొత్తం 234 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 22న నోటిఫికేషన్, మే 16న పోలింగ్.
* కేరళ: మొత్తం 140 స్థానాలకు మొదటి దశలోనే మే 16న పోలింగ్.
* పశ్చిమబెంగాల్: మొత్తం ఆరు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఫేస్ 1లో 18 నియోజకవర్గాలకు రెండు రోజుల పోలింగ్ ఉంటుంది. మార్చి 11న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. పోలింగ్ ఏప్రిల్ 4న - ఏప్రిల్ 11న ఉంటుంది.
- రెండో దశలో 56 నియోజకవర్గాలు. మార్చి 22న నోటిఫికేషన్, పోలింగ్ ఏప్రిల్ 17.
- మూడో దశలో 62 నియోజకవర్గాలు, మార్చి 28న నోటిఫికేషన్, పోలింగ్ ఏప్రిల్ 21.
- నాలుగో దశ... 49 నియోజకవర్గాలు.. ఏప్రిల్ 1న నోటిఫికేషన్, పోలింగ్ ఏప్రిల్ 25
- అయిదో దశ... 53 నియోజకవర్గాలు, ఏప్రిల్ 4న నోటిఫికేషన్, ఏప్రిల్ 30న పోలింగ్
- ఆరో దశ... 25 నియోజకవర్గాలు... ఏప్రిల్ 11న నోటిఫికేషన్... మే 5న ఎన్నికలు ఉంటాయి.
* అస్సాం:
మొదటి దశలో 65 నియోజకవర్గాలకు మార్చి 11న నోటిఫికేషన్, ఏప్రిల్ 4న పోలింగ్
రెండో దశలో 61 నియోజకవర్గాలు.. మార్చి 14న నోటిఫికేషన్.. ఏప్రిల్ 11న పోలింగ్ ఉంటుంది.
మే 19న ఓట్ల లెక్కింపు ఉంటుంది.