Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి : బొత్స త‌గ్గేదేలే అంటున్నారు ?

By:  Tupaki Desk   |   3 March 2022 2:33 PM GMT
అమ‌రావ‌తి : బొత్స త‌గ్గేదేలే అంటున్నారు ?
X
కోర్టులో ఇవాళ అమ‌రావ‌తి రైతులు గెలిచారు.కోర్టులోనే కాదు ప్ర‌జ‌ల హృద‌యాల్లో స్థిర స్థానం సంపాదించుకుని తామే గెలిచామ‌ని రైతులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. మొద‌ట దీనిని కొన్నిగ్రామాల స‌మ‌స్య‌గానే ఫోక‌స్ చేసి త‌మ‌ను కించ‌ప‌రిచార‌ని రైతులు అంటుంటే, తాము ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ కొత్త బిల్లు తీసుకు వ‌చ్చేందుకే సిద్ధంగా ఉన్నామ‌ని బొత్స మ‌రో మారు త‌న వాద‌న ఏక‌ధాటిగా వినిపిస్తున్నారు.

కింది కోర్టులో న్యాయం జ‌ర‌గ‌క‌పోతే పై కోర్టు ఎలాపోతామో తామూ అదే విధంగా సుప్రీం గుమ్మం తొక్కే అవ‌కాశాలు ఉన్నాయని అంటున్నారు బొత్స.

సీఆర్డీఏ ర‌ద్దుకు సంబంధించి ఇప్ప‌టికే తాము తీసుకున్న నిర్ణ‌యం ఉప‌సంహ‌రించుకున్నాక కొత్తగా కోర్టు చెప్పేదేమీ ఉంద‌ని బొత్స ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు.తాము ఇప్ప‌టికే 3 రాజ‌ధానుల బిల్లును కూడా వెన‌క్కు తీసుకున్నామ‌ని,అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర దీనిపై ఇప్ప‌టికే ఓ ప్ర‌క‌ట‌న చేశార‌ని అన్నారు.

ఈ నేప‌థ్యంలో తాము తీర్పు కాపీ పూర్తిగా చ‌దివాక స్పందిస్తామ‌ని, అప్పుడే సుప్రీంకు పోవాలో వ‌ద్దో అన్న‌ది ఆలోచిస్తామ‌ని చెప్పారు.రాజ్యాంగబద్ధంగా చ‌ట్టాలు చేసేందుకే పార్ల‌మెంట్ కానీ అసెంబ్లీ కానీ ఉన్నాయ‌ని మ‌రోమారు గుర్తు చేశారు.

మూడునెలల్లో రాజ‌ధాని రైతుల‌కు ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వ‌మ‌ని చెప్ప‌డంపై ఏకీభ‌వించ‌లేదు బొత్స.అది సాధ్యం కాద‌ని కూడా అంటున్నారు బొత్స. ఇదేమ‌యినా ప్రాక్టిక‌ల్ గా సాధ్య‌మవుతుందా లేదా అన్న‌ది కూడా చూడాలి అని అంటున్నారు బొత్స. ఈ మాట‌లు ఎలా ఉన్నాఆ రోజు ఇక్క‌డ ఏమీ లేదు స్మ‌శానం త‌ప్ప అని వ్యాఖ్యానించిన బొత్స ఇవాళ ఇన్నిమాట‌లు ఎలా చెప్ప‌గ‌లుగుతున్నార‌ని అని ప్ర‌శ్నిస్తోంది టీడీపీ.

బిల్లును వెన‌క్కు తీసుకుంటున్నామ‌ని ప్ర‌క‌టించి,త‌రువాత సంబంధిత సీఆర్డీఏ చ‌ట్టాన్ని అమ‌లుచేస్తున్నామ‌ని చెబుతున్న బొత్స మ‌రి! ఎందుక‌ని రాజ‌ధాని భూముల‌ను తాక‌ట్టు పెట్టి రుణాలు తీసుకు వచ్చేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుందో..అందుకు త‌గ్గ కార‌ణాలేంటో చెప్ప‌గ‌ల‌రా అని ప్ర‌శ్నిస్తోంది విప‌క్షం. ఇంత జ‌రిగినా కూడా తాము వెన‌క్కు త‌గ్గ‌మ‌ని 3 రాజ‌ధానుల కోసం తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని వాటిని క‌ట్టే చూపిస్తామ‌ని అంటున్నారు.