Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాలకు త్వరలోనే గుడ్ న్యూస్.. పెరగనున్న 'సీట్లు'
By: Tupaki Desk | 29 Jun 2022 6:36 AM GMTరెండు తెలుగు రాష్ట్రాలకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్ర విభజన చట్టం మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు పెంచాల్సిన అసెంబ్లీ సీట్ల సంఖ్యపై కేంద్ర సర్కారు కసరత్తు ప్రారంభిం చినట్టు తెలిసింది. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను బట్టి.. ఏపీ, తెలంగాణల్లో త్వరలోనే అసెంబ్లీ స్థానాలను పెంచేందుకు కేంద్రం అడుగులు వేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టేందుకు కార్యాచరణ ప్రారంభమైంది.
విభజన చట్టం ప్రకారం.. ఏపీలో 50 స్థానాలు, తెలంగాణలో 34 స్థానాలు పెరగాల్సి ఉంది. దీంతో ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 స్థానాలు.. 225కు పెరుగుతాయి. అదేవిధంగా తెలంగాణలో 119 స్థానాలకు 153 వరకు పెరగనున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్షాలకు ఇది ఒక మంచి అవకాశంగా మారుతుంది.
అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందనే భావన కూడా ఉంది. అయితే.. ఈ ప్రక్రియకు ముందుగానే మోడీ సర్కారు ముహూర్తం నిర్ణయించింది. 2024 ఎన్నికల నాటికి నియోజకవర్గాల ను పునర్వ్యస్థీకరిస్తామని ప్రకటించింది.
అనుకున్న విధంగానే.. వచ్చే ఎన్నికల్లోగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లను పెంచేందుకు వీలుగా కార్యాచరణ ప్రారంభమైంది. తొలుత దీనికి సంబంధించి బిల్లును రూపొందించాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే పని ప్రారంభమైనట్టు తెలిసింది. పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టేందుకు వీలుగా అడ్మినిస్ట్రేటివ్ రిపోర్టు పంపాలని.. కేంద్ర న్యాయశాఖ రెండురాష్ట్రాలను కోరినట్టు సమాచారం. రాష్ట్రాలు ఇచ్చే రిపోర్టు ఆధారంగా.. బిల్లును రూపొందించి.. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే దీనిని ప్రవేశ పెట్టే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
ఇక, కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో రిజర్వేషన్ల ప్రక్రియ కూడా కీలకంగా మారనుంది. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను కేటాయించాల్సి ఉంటుంది. దీనికి కూడా కొంత సమయం పడుతుందని అంటున్నారు. తొలుత.. నియోజకవర్గాల సంఖ్యను పెంచే ప్రక్రియను చేపట్టి.. దీనిని ఆమోదించుకున్నాక.. గవర్నర్, రాష్ట్రపతి ఆదేశాల మేరకు రిజర్వ్‌డ్ నియోజకవర్గాలను నిర్ణయించనున్నారు.
అనంతరం వీటికి అభ్యంతరాలను కూడా స్వీకరిస్తారు. తర్వాత.. కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి.. గెజిట్‌లో ప్రకటించిన తర్వాత.. ఈ నియోజకవర్గాలు అమల్లోకి వస్తాయి. ఈ ప్రక్రియ అంతా ముగిసేందుకు ఎంత లేదన్నా.. ఏడాదిపైనే సమయం పడుతుందని తెలుస్తోంది.