Begin typing your search above and press return to search.
బతుకుతామో లేదో.. ముందే ఆస్తి పంపకాలు
By: Tupaki Desk | 5 April 2020 1:48 PM GMTకరోనా వైరస్ భయం కొందరిలో తీవ్రంగా ఉంది. తమకు ఎక్కడ సోకుతుందేమోనని కొందరు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భయం ముఖ్యం సంపన్నుల్లో ఉంది. ఎందుకంటే వారు తరచూ వివిధ పనుల నిమిత్తం విదేశాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఆ క్రమంలో తమకు కరోనా వైరస్ సోకిందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ కరోనా సోకి తాము మరణిస్తే అనే ఆలోచనలు కూడా చేస్తున్నారంట. తాము మరిణిస్తే తమ కుటుంబం.. వ్యాపారాల పరిస్థితి ఏమిటని ఆలోచించి ఈ మేరకు ముందే ఆస్తి పంపకాలు చేస్తున్నారని చర్చ సాగుతోంది. అందుకే వీలునామాలు సిద్ధం చేసుకుంటున్నారంట. కరోనా భయంతో సంపన్న వర్గం నిద్ర లేని రాత్రులు గడుపుతోంది. ముందే వారికి నిద్ర రాదు. అలాంటి కరోనా భయంతో అసలుకే నిద్ర పోవడం లేదు. ఈ క్రమంలో ఏవేవో ఆలోచించుకుంటూ భయాందోళన చెందుతున్నారు. అందులో భాగంగా తమ కుటుంబసభ్యులకు ముందే అప్పగింతలు చేస్తున్నారంట. ఉంటామో.. పోతామో తెలియదు.. ఒకవేళ హఠాత్తుగా పోతే ఎలా అని ఆలోచించుకుని అందుకే ముందుగానే తమ పిల్లలకు ఆస్తులు - వ్యాపారాలు అప్పగిస్తున్నారంట. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారని న్యాయవాదులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో వారు భయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో తమ వ్యాపారాలు - కంపెనీలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం. అందులో భాగంగా ముందు ఆస్తులు పంచిన అనంతరం తమ వ్యాపారాలు - సంస్థలు - కార్యాలయాలను పంచే పనిలో పడ్డారంట. దేశంలో పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు మొత్తం 108 ఉన్నాయి. ఇంకా నమోదు కాని కంపెనీలు, వ్యాపారాలు ఎన్నో ఉంటాయి. దిగువ మధ్య తరగతి ప్రజల ఆర్థిక వ్యవహారాలు ఉంటాయి. వీరంతా కలిసి తమ ఆస్తులను పంచుకునే పనిలో పడ్డారు. దేశంలోని 97శాతం కుటుంబ వ్యాపారాల్లో వారసత్వంపై సరైన మార్గదర్శకాలు - పత్రాలు లేవు. ఈ సమయంలో వారు మరణిస్తే కుటుంబసభ్యుల మధ్య విబేధాలు తీవ్రమవుతాయనే ఆందోళనతో ముందే పంపకాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారంట. అందుకే వీలునామాలు సిద్ధం చేసుకుంటున్నారంట. ఈమేరకు ముసాయిదా రూపొందించుకునే పనిలో పడ్డారు. అందుకే వీలునామా ముసాయిదా చేయాలంటూ కొన్నిరోజులుగా తమకు వినతులు పెరిగాయని న్యాయ సేవలు అందించే సంస్థలు చెబుతున్నాయి. ఈ విధంగా సంపన్న సంపన్నులను కరోనా భయం పట్టి పీడిస్తోంది. దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుండడమే వారి భయానికి కారణమవుతోంది.
ఇప్పటికాలంలో మాట కన్నా పత్రానికి అధిక విలువ ఉంది. అందుకే వీలునామా చేసేందుకు తమ న్యాయవాదుల వద్దకు వెళ్తున్నారు. వీలునామా లేకుంటే భవిష్యత్తులో కుటుంబసభ్యుల మధ్య గొడవలు చెలరేగే అవకాశం ఉండడంతో లాయర్లను సంప్రదించి ఆ మేరకు వీలునామా సిద్ధం చేయిస్తున్నారు.