Begin typing your search above and press return to search.
అంచనాలు నిజం.. ఢిల్లీలో సామాన్యుడికే పట్టం
By: Tupaki Desk | 11 Feb 2020 4:15 AM GMTఅందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వెల్లడవుతున్నాయి. కీలకమైన పోలింగ్ ముగిసిన వెంటనే.. వెల్లడైన వివిధ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ కు తగ్గట్లే తాజాగా ఫలితాలు వెల్లడవుతున్నాయి. 2015లో జరిగిన ఎన్నికల్లో 67 స్థానాల్లో దూసుకెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి ఆ స్థాయిలో ఫలితాలు రావు కానీ.. తిరుగులేని అధిక్యత మాత్రం లభిస్తుందన్న అంచనాకు తగ్గట్లే తాజాగా ఫలితాలు వెలువడుతున్నాయి.
ఢిల్లీ రాష్ట్రంలో మొత్తం 70 స్థానాలు ఉండగా.. అందులో అత్యధిక సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకే సొంతం కానున్నట్లుగా ఫలితాల సరళిని చూస్తే అర్థం కాక మానదు. రౌండ్ రౌండ్ కు కేజ్రీవాల్ పార్టీ అధిక్యత స్పష్టమవుతుంది. ఎన్నికల పోలింగ్ ముగిసినవెంటనే వెల్లడైన ఎగ్జిల్ పోల్స్ ఫలితాల ప్రకారం అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి 45 నుంచి 60 స్థానాల మధ్యలో గెలిచే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి.
తాజాగా వెల్లడవుతున్న ఫలితాల్ని చూస్తే.. ఇప్పటివరకూ ఉన్న ట్రెండ్ ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ 45 స్థానాల్లో అధిక్యతలో ఉండగా.. విపక్ష బీజేపీ 14 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు ఒక్క స్థానంలోనే అధిక్యతలో ఉన్నారు. తుది ఫలితాలు దాదాపు ఇదే తీరులో ఉండే అవకాశం ఉంది. దీంతో.. తాము కచ్ఛితంగా అధికారంలోకి వస్తామంటూ కొందరు బీజేపీ నేతలు చెప్పిన మాటల్లో ఏ మాత్రం నిజం లేదని తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పకతప్పదు.