Begin typing your search above and press return to search.
టార్గెట్ రీచైన జగన్!
By: Tupaki Desk | 20 Nov 2021 12:30 AM GMTఅంతవరకే అనుకోవాలి. ఎందుకంటే ఏడున్నరేళ్ళుగా పెండింగ్ లోనే ఉన్న విభజన హామీలను దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశంలో లేవనెత్తాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. కేంద్ర హోంశాఖ అమిత్ షా ఛైర్మన్ గా జరిగిన ఈ సమావేశంలో ప్రత్యేక హోదాతో పాటు అనేక అంశాలను జగన్ ప్రస్తావించారు.
ఇదే విషయాన్ని ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ, అమిత్ తో ఇప్పటికే చాలాసార్లు జగన్ ప్రస్తావించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎంతకాలమైనా సమస్యలు పెరుగుతున్నాయే కానీ పరిష్కారం కావడం లేదు.
అందుకనే సమావేశానికి హాజరైన సీఎంలు, గవర్నర్లు సమక్షంలోనే జగన్ ప్రస్తావించారు. అంటే తన టార్గెట్ ను మాత్రం జగన్ రీచయ్యారని చెప్పాలి. ఇక మిగిలిన పార్ట్ అమిత్ షా చేతిలోనే ఉంది. నిజానికి నరేంద్ర మోడీ ఏమి చెబితే అది చేయటమే షా పని. అంతేకానీ స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోవటమో లేకపోతే మోడీని కూడా ఒత్తిడి పెట్టి ఒప్పించేంత సీన్ షా కు లేదని అందరికీ తెలుసు. ఏదేమైనా ఏ పని చేయాలన్నా ఇద్దరు మాట్లాడుకునే నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం వాస్తవం.
ఇక్కడే తిరుపతి సమావేశంలో అమిత్ షా స్పందన పై జనాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్ విభజన హామీలను ప్రస్తావించిన తర్వాత సమస్యలన్నింటినీ కేంద్రం పరిష్కరిస్తుందని షా ఓ హామీని పడేశారు.
నిజానికి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ లాంటి ఏ హామీని కూడా అమలు చేసే ఉద్దేశ్యంలో మోడీ లేరు. ఎందుకనో మోడీకి మొదటి నుంచి ఏపి ప్రయోజనాలను కాపాడే విషయంలో చిన్నచూపే కనబడుతోంది. అందుకనే ఏపీ అంటేనే ఇపుడు మోడి పూర్తిగా దూరం పెట్టేస్తున్నారు.
నిజానికి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి సీఎంగా ఎవరున్నారనే విషయానికి ఏమాత్రం సంబంధం లేదు. సీఎంలుగా వ్యక్తులు వస్తారు పోతారు. రాష్ట్రమే శాస్వతం. రాష్ట్ర ప్రయోజనాలే శాశ్వతంగా నిలిచిపోతాయి. కానీ ఇప్పటి నేతల్లో అంతటి చిత్తశుద్ది ఎంతమందిలో ఉంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో మన్మోహన్ సింగ్ స్వయంగా రాజ్యసభలో చేసిన ప్రత్యేక హోదా ప్రకటననే తర్వాత అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ పూచిక పుల్లతో సమానంగా తీసిపారేశారు.
పార్లమెంట్ లో అప్పటి ప్రధానమంత్రి చేసిన ప్రకటనను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం తిరుపతిలో జగన్ కు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందా ? రాజకీయంగా ఏపీ మద్దతు కంపల్సరీ అని అనుకున్నపుడు మాత్రమే విభజన హామీల అమలు గురించి మోడీ, షా పట్టించుకుంటారు. అప్పటివరకు ఏపీ ఎంపీలు వెయిట్ చేయక వేరే దారి లేదు. చూద్దాం అందరి ముందు ఇచ్చిన హామీని షా ఏ మేరకు నెరవేరుస్తారో.