Begin typing your search above and press return to search.
రమేశ్ హాస్పిటల్స్ లో రూ.250 కోట్ల పెట్టుబడులు.. ఆ కంపెనీ ఎక్కడుంది?
By: Tupaki Desk | 17 Aug 2020 2:47 PM GMTఏపీలో కలకలం రేపిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. దుబాయ్ కేంద్రంగా ఉన్న ‘ఆస్టర్ కంపెనీ’రమేశ్ హాస్పిటల్స్ లో 51శాతం వాటా కలిగి ఉందని పోలీసులు తేల్చారు. రమేశ్ హాస్పిటల్స్ లో ఆస్టర్ కంపెనీకి సుమారు రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తులో తేలినట్టు సమాచారం. ఈ మేరకు ఆస్టర్ కంపెనీ యజమాన్యానికి నోటీసులు ఇచ్చారని తెలిసింది.
ఈ కేసులో విచారణ జరుపుతున్న పోలీసులకు విజయవాడతోపాటు గుంటూరు, ఒంగోలులోని ‘రమేశ్ ఆస్పత్రుల్లో’ అస్టర్ కంపెనీకి షేర్లు ఉన్నాయని తేలినట్టు సమాచారం. ఇంతకీ ఈ ఆస్టర్ కంపెనీ ఎక్కడుంది? అది ఎవరిది? అనే వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులున్నారు.
రమేశ్ ఆసుపత్రి విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ సెంటర్ కోసం ఎంవోయూ కుదుర్చుకున్నారని.. అయితే అందులో విద్యుత్ సమస్యలున్నాయని తెలిసినా పట్టించుకోలేదని పోలీసుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. విద్యుత్ లోపాలు సరిచేయకపోవడమే ఈ అగ్నిప్రమాదానికి కారణంగా రిపోర్టులో పేర్కొన్నారు. మొత్తం ఈ అగ్నిప్రమాదానికి రమేశ్ ఆసుపత్రి, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యాలదే బాధ్యతగా నిర్ధారించారు.