Begin typing your search above and press return to search.
స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం .. ‘ఆస్టర్’కు నోటీసులు !
By: Tupaki Desk | 17 Aug 2020 2:00 PM GMTఏపీలో కలకలం సృష్టించిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన జరిగి వారం రోజులు అవుతోంది. ఆగస్టు 9వ తేదీన తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 10మంది కొవిడ్ పేషెంట్లు చనిపోయారు. దీనిపై పోలీసులు దర్యాఫ్తుని స్పీడప్ చేశారు. అగ్నిప్రమాదం ఘటనపై విచారణ జరిపిన దర్యాఫ్తు బృందం 4 పేజీల రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసింది. ఈ కేసు దర్యాఫ్తులో భాగంగా ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. దుబాయ్ కేంద్రంగా ఆస్టర్ కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు గుర్తించిన పోలీసులు, రమేష్ హాస్పిటల్స్ లో ఆస్టర్ కంపెనీకి 51శాతం వాటా ఉన్నట్టు తేల్చారు. రమేష్ హాస్పిటల్స్ లో ఆస్టర్ కంపెనీ సుమారు రూ.250 కోట్ల పెట్టబడులు పెట్టినట్లు దర్యాఫ్తులో తేలింది. ఈ కేసులో మరిన్ని కోణాల్లో ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు పోలీసులు.
కేరళకు చెందిన డాక్టర్ అజాద్ మూపెన్ ఫౌండర్ చైర్మన్, ఎండీగా దుబాయ్‌లో 1987లో ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ సంస్థను స్టార్ట్ చేసారు. ఇక, రమేష్ హాస్పిటల్స్ లో 51 శాతం వాటా కింద ఆస్టర్ సుమారు రూ. 250 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఒంగోలు, గుంటూరు, విజయవాడలోని పలు హాస్పిటల్స్ లో కూడా ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ సంస్థకు వాటాలు ఉన్నాయి అని గుర్తించారు. ఈ నేపథ్యంలో రమేష్ హాస్పిటల్స్ వాటాదారైన ‘ఆస్టర్’ సంస్థకు కూడా నోటీసులు జారీ చేసి వివరాలు సేకరిస్తామని ఏసీపీ సూర్యచంద్రరావు వెల్లడించారు.
ఇక, అగ్నిప్రమాదం ఘటనపై విచారణ జరిపిన దర్యాఫ్తు బృందం 4 పేజీల రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసింది. రమేష్ హాస్పిటల్స్, స్వర్ణప్యాలెస్ యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగానే.. అగ్నిప్రమాదం జరిగిందని రిపోర్టులో చెప్పారు. కరోనా కేర్ సెంటర్ ఏర్పాటు విషయమై రమేష్ ఆసుపత్రి, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యాలు ఎంవోయూ కుదుర్చుకున్నాయని రిపోర్టులో పొందుపరిచారు. స్వర్ణ ప్యాలెస్ లో విద్యుత్ లోపాలు ఉన్నాయని, ఆ విషయం రెండు యాజమాన్యాలకు తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వాటి రిపేర్ కి ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందని పట్టించుకోలేదని తేల్చారు.